చైతూ చివ‌ర‌కు ఆ సాహసం చేశాడుగా..


యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, మంజిమ మోహన్ జంటగా గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మరో లవ్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్ 'సాహసం శ్వాసగా సాగిపో`. మిర్యాల‌ స‌త్య‌నారాయ‌ణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్‌ బేనర్‌పై గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. ఏ మాయ చేసావే త‌ర్వాత నాగ‌చైత‌న్య‌, గౌత‌మ్‌మీన‌న్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాను న‌వంబ‌ర్ 11న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఓవ‌ర్‌సీస్‌లో ఈ చిత్రం ప్రణీత మీడియా ద్వారా ఓవ‌ర్‌సీస్‌లో విడుద‌ల‌వుతుంది. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, సినిమాటోగ్రఫీ: డాన్‌మాక్‌ ఆర్థర్‌, ఎడిటింగ్‌: ఆంటోని, ఆర్ట్‌: రాజీవన్‌, ఫైట్స్‌: సిల్వ, రచన: కోన వెంకట్‌, నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గౌతమ్‌ వాసుదేవ మీనన్‌.