Latest News

'జై సింహా' మూవీ రివ్యూ 'అజ్ఞాత‌వాసి' మూవీ రివ్యూ జూన్‌ నుంచి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ కొత్త చిత్రం విష్ణు మంచు - జి నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ రేపు విడుదల ! న‌టన మీలో దాగున్న వ‌ర‌మా..? ఛాన్స్ మేమిస్తాం! గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' టీజర్‌ విడుదల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్ 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది - రాజ్ త‌రుణ్‌ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ , ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం

Sahasam Swarasa Saagipo Release Date


సాహ‌సం చేయ‌నున్న చైతూ..
సినిమా ఎప్పుడో ఆరు నెల‌ల ముందు రిలీజ్ కావాల్సిన సినిమా. కానీ ఎందుకో కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల ఎప్ప‌టిక‌ప్పుడు సినిమా వాయిదా ప‌డుతూనే వస్తోంది. అయినా సినిమా మీద క్రేజ్ ఏమీ తగ్గలేదు. ఎందుకు త‌గ్గుతుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివ‌ర‌కు జనాలకు పరిచయం చేసిన ప్రతి విశేషం ఆకట్టుకునేలా ఉంటుంటే. ఫస్ట్ టీజర్, త‌ర్వాత సెకండ్ టీజ‌ర్.. ఆపై ఎల్లిపోమాకే సాంగ్.. అన్నీ కూడా చాలా రిచ్ గా, ఆస‌క్తిక‌క‌రంగా ఉంటూ.. సినిమా మీద ఆసక్తిని పెంచాయి.
నాగ‌చైత‌న్య హీరోగా, గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సాహ‌సం శ్వాస‌గా సాగిపో సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. ఈ సినిమాకు సంబంధించిన మూడు పాట‌ల‌ను రిలీజ్ చేయ‌డంతో, సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెరిగిపోయాయి. అయితే ఈ సినిమా ఆడియోను జూన్ 17న, సినిమాను జులై 15న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌నే టాక్ ఈ మధ్య బాగా గ‌ట్టిగానే వినిపించింది. ఈ టాక్ ఆ నోటా, ఈ నోటా డైర‌క్ట‌ర్ చెవిన పడిందో ఏమో కానీ, ఆ తేదీల‌నే ఫిక్స్ చేస్తున్న‌ట్లు గౌత‌మ్ మీన‌న్ చెప్పారు.
ఇటీవ‌ల విడుద‌ల చేసిన పాట‌ల‌కు తాను ఆశించిన స్థాయిలో కంటే రెస్పాన్స్ బాగా వ‌చ్చింద‌ని, ఎ.ఆర్ రెహ‌మాన్ సంగీతానికి తన‌లాగే ప్రేక్ష‌కులు కూడా స్పందించ‌డ‌మే దానికి కార‌ణ‌మ‌న్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కిన ఈ సినిమాలో మంజిమా మోహ‌న్ హీరోయిన్ గా న‌టిస్తుంది. పాట‌ల లాగే సినిమా కూడా ఘ‌న విజ‌యాన్ని సాధిస్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు గౌత‌మ్ మీన‌న్.