సెప్టెంబర్ 8 న విడుదల అవబోతున్న 'వీడెవడు'.


సచిన్ జోషి, ఈషాగుప్తా జంటగా నటించిన తాజా చిత్రం 'వీడెవడు' సెప్టెంబర్ 8 న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ చిత్రానికి తాతినేని సత్య దర్శకత్వం వహించాడు. హీరో సచిన్ జోషి నటుడిగానే కాకుండా సీసీఎల్ క్రికెటర్ గా ప్రేక్షకులని బాగా పరిచయం. సెప్టెంబర్ 8 న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి చాల అడ్డకులే ఉన్నాయి అని చెప్పాలి. అదే రోజు అక్కినేని నాగచైతన్య ' యుద్ధం శరణం ', మంచు మనోజ్ ' ఒక్కడు మిగిలాడు ', అల్లరి నరేష్ ' మీద మీద అబ్బాయి ', మరియు శింబు, నయనతార ' సరసుడు చిత్రాలు విడుదల అవబోతున్నాయి.