Latest News

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్ విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న న‌దియా `దేవి` హైత‌మ్ కాలేజ్ లో సంద‌డి చేసిన రాశీ ఖన్నా దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల క్రేజ్ ని వాడుకుంటున్నారు, సాయి పల్లవి సినిమాకి టైటిల్ గా 'హేయ్ పిల్లగాడా' సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ విడుదల తేదీ ప్రకటించిన వివేకం చిత్ర యూనిట్. తెలుగులో వీఐపీ2 విడుదల తేదీ ఖరారైంది. నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా

చైతూ ఈ సారైనా శ్వాస తీసుకుంటాడా..


అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శ‌ని ఉంద‌న్న‌ట్లు, సినిమా షూటింగ్ అంతా అయిపోయినా, కొన్ని సినిమాలు మాత్రం విడుద‌ల‌కు ఎన్నో వాయిదాలు ప‌డుతుంటాయి. ఆ లిస్ట్ లో ఒక‌టైన సినిమా, ఎట్టకేలకు విడుదలయ్యేలా కనిపిస్తోంది. గౌతమ్ మీనన్, నాగ చైత‌న్య కాంబినేషన్లో తెరకెక్కిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ నవంబర్లో పక్కాగా రిలీజయ్యేలా కనిపిస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి గత కొన్ని నెలలుగా ఎన్నెన్నో ఊహాగానాలు వచ్చినా స్పందించని గౌతమ్.. తాజాగా రిలీజ్ డేట్ ప్ర‌స్తావించాడు.
అయితే ఈ చిత్రం తెలుగుతో పాటూ త‌మిళంలో కూడా తెర‌కెక్కుతున్న విష‌యం విదిత‌మే. తెలుగులో నాగ‌చైత‌న్య న‌టిస్తుండ‌గా, త‌మిళంలో శింబు న‌టిస్తున్నాడు. ఈ మూవీ తెలుగు వెర్ష‌న్ ఎప్పుడో రెడీ అయి, ఫ‌స్ట్ కాపీ కూడా చేతిలో పెట్టుకున్న‌ప్ప‌టికీ, తమిళ వెర్ష‌న్ విష‌యంలో మాత్రం ఇబ్బందుల కార‌ణంగా ఈ సినిమా లేట్ అయింది. అయితే ఇప్పుడు ఆ చిత్ర తమిళ వెర్షన్ విషయంలో ఇబ్బందులన్నీ తొలగిపోయినట్లు గౌతమ్ వెల్లడించాడు. తెలుగు వెర్షన్ ట్రైలర్ మూడు నెలల ముందే రిలీజవ్వగా.. తమిళ ట్రైలర్ ఇప్పుడే లాంచ్ చేయడం విశేషం. ఆదివారమే ట్రైలర్ రిలీజ్ చేశాడు గౌతమ్.
ఈ సందర్భంగా గౌతమ్ మీనన్ ట్విట్టర్లో.. ‘‘అచ్చం ఎన్బదు మదమాయద ఫైనల్ లెగ్ ప్రమోషన్లు ఈ ట్రైలర్ తోనే మొదలవుతున్నాయి. రిలీజ్ డేట్ కనుచూపు మేరలో కనిపిస్తోంది. త్వరలోనే ఇక్కడే ట్విట్ట‌ర్ లో వెల్లడిస్తా’’ అని పేర్కొన్నాడు. అంటే న‌వంబ‌ర్ లో ఈ సినిమా పక్కా అనుకోవచ్చు. ఇటీవ‌లే ప్రేమ‌మ్ తో హిట్ తో మంచి జోష్ లో ఉన్న చైతూకు న‌వంబ‌ర్ లో రిలీజ్ అంటే క‌లిసొచ్చే విష‌య‌మే. ఎన్నో వాయిదాల త‌ర్వాత వ‌చ్చే సినిమా అయిన‌ప్ప‌టికీ, ఈ సినిమా మీద మంచి అంచ‌నాలే ఉన్నాయి. మంజిమా మోహ‌న్ తెలుగు, త‌మిళ భాష‌ల్లో హీరోయిన్ గా న‌టిస్తుంది.