Latest News

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్ విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న న‌దియా `దేవి` హైత‌మ్ కాలేజ్ లో సంద‌డి చేసిన రాశీ ఖన్నా దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల క్రేజ్ ని వాడుకుంటున్నారు, సాయి పల్లవి సినిమాకి టైటిల్ గా 'హేయ్ పిల్లగాడా' సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ విడుదల తేదీ ప్రకటించిన వివేకం చిత్ర యూనిట్. తెలుగులో వీఐపీ2 విడుదల తేదీ ఖరారైంది. నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా

మ‌ళ్లీ వెనుక‌డుగు వేసిన సింగం


 సూర్య , శ్రుతిహ‌స‌న్‌, అనుష్క‌లు జంట‌గా నటిస్తున్న చిత్రం "S3-య‌ముడు-3". ఈ చిత్రానికి హ‌రి ద‌ర్శ‌కుడు.  ఈ చిత్రాన్నిస్టూడియో గ్రీన్‌ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా స‌గ‌ర్వంగా స‌మ‌ర్పిస్తూ తెలుగులో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత మల్కాపురం శివకుమార్‌ నిర్మిస్తున్నారు. హారిస్ జైరాజ్ సంగీతం అందించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి జ‌న‌వరి 26 న విడుద‌ల కావ‌ల‌సిన ఈ చిత్రం త‌మిళ‌నాట నెల‌కొన్న ప‌రిస్థితుల కార‌ణంగా విడుద‌ల వాయిదా వేస్తున్నారు.
 
ఈ సందర్భంగా నిర్మాత‌ మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ.. త‌మిళ‌, తెలుగు బాష‌ల్లో ఈనెల 26 న విడుద‌ల కావ‌ల‌సిన "S3-య‌ముడు-3 చిత్రం విడుద‌ల వాయిదా వేశాము. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంగా విడుద‌ల చేయ‌టానికి ప్లాన్ చేసిన ఈ చిత్రం ప్ర‌స్తుతం జ‌ల్లిక‌ట్టు నేప‌ధ్యంలో త‌మిళ‌నాట కొన‌సాగుతున్న ప‌రిస్థితుల్ని గ‌మ‌నించి, ఇది విడుద‌ల‌కి స‌రియైన స‌మ‌యం కాద‌ని త‌ల‌చి ఈ నిర్ణ‌యం తీసుకొవ‌టం జ‌రిగింది.  డైర‌క్ట‌ర్ హ‌రి గారు , సూర్య గారి కాంబినేష‌న్ లో వ‌చ్చే చిత్రం కొసం తమిళ‌, తెలుగు ప్రేక్షుకులు ఏ విధంగా ఎదురుచూస్తుంటారో అంద‌రికి తెలుసు.. కాని ప‌లు కార‌ణాల వ‌ల‌న ఈ చిత్రం విడుద‌లని ఏప్ప‌టిక‌ప్ప‌డు వాయిదా వేసుకుంటూ వ‌స్తున్నాం. రెండు రాష్ట్రాల్లో అన్ని ప‌రిస్థితులు అనుకూలంగా వున్న టైంలో చిత్రాన్ని విడుద‌ల చేస్తాం. మా త‌దుప‌రి విడుద‌ల తేది ని అతిత్వ‌ర‌లో తెలియ‌జేస్తాం..  అని అన్నారు.