Robin Hood Is Getting Ready


The last film of Ravi teja is Bengal tiger.After that he took a long gap. A movie also stopped in last minute.Now Robin hood is also getting very late. This late is because of the story development.
Young director Chakri is going to introduce with this film which is completing it's preproduction works. Unit is planning to take this movie on sets from July. DVV Danayya is producing this film in which Rashi khanna is playing a female lead.Ravi teja kept many hopes on this film.
రాబిన్ హుడ్ రెడీ అవుతున్నాడు..
 
ర‌వితేజ లాస్ట్ మూవీ బెంగాల్ టైగ‌ర్. ఈ సినిమా త‌ర్వాత ర‌వితేజ త‌న దూకుడును కంటిన్యూ చేస్తాడ‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ ఊహించ‌ని విధంగా కొంత గ్యాప్ తీసుకున్నాడు. చివ‌రి నిమిషంలో ఒక సినిమా ఆగిపోవ‌డ‌మే కాకుండా, ప్రెజంట్ త‌ను చేస్తున్న రాబిన్ హుడ్ సినిమా విష‌యంలో కూడా కొంత లేట్ అయింది. అయితే ఈ క‌థ విష‌యంలో క‌స‌ర‌త్తు ఎక్కువ‌గా చేయ‌డం వ‌ల్ల‌నే ఆల‌స్య‌మైంద‌ని తాజా స‌మాచారం.
ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం ద్వారా చ‌క్రి అనే యంగ్ డైర‌క్ట‌ర్ ప‌రిచ‌యం కానున్నాడు. జులై నెల‌లో ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ర‌వితేజ స‌ర‌స‌న రాశీఖ‌న్నా జ‌త‌క‌ట్ట‌నుంది. ఈ సినిమాపై ఎంతో న‌మ్మ‌కం పెట్టుకున్న ర‌వితేజ ఆశ‌ల‌ను ఈ సినిమా తీరుస్తుందో లేదో చూడాలి.