చిన్న సినిమా ర‌క్ష‌ణ మా ధ్యేయం.. నిరాహార దీక్ష‌కు సిద్ధంగా ఉన్నాం!!


`తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ర్టీలో రెండు ర‌కాల వ్య‌వ‌స్థ‌ల ద్వారా ఇండ‌స్ర్టీ అంత ఛిన్నాభిన్నం అవుతుంది. ఒక‌టి థియేట‌ర్ లెస్ విధానం వ‌ల్ల ఒక న‌లుగురు ఐదుగురు చేతుల్లోనే రెండు రాష్ర్టాల సినిమా థియేట‌ర్ల‌ను వాళ్ల గుప్పిట్లో పెట్టుకుని చిన్న సినిమాలు మ‌రియుకొన్ని పెద్ద సినిమాలు విడుద‌ల కాకుండా చేస్తున్నారు. దాదాపు 250 సినిమాలు సెన్సార్ అయి రిలీజ్ కాకుండా ఉన్నాయి. అందులో ఒక‌టి అమ్మ‌కు ప్రేమ‌తో ఒక రూపాయి కూడా ఫైనాన్స్ లేదు. సినిమా సెన్సార్ అయింది. కాని థియేట‌ర్లు దొర‌క‌క సినిమా విడుద‌ల కాలేదని` అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు తెలంగాణ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్‌ కామ‌ర్స్ అధ్య‌క్షుడు ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్. 

ఇంకా ఆయ‌న మాట్లాడుతూ, -  రెండ‌వ‌ది డిజిటల్ వ్య‌వ‌స్థ‌ను ముగ్గురు పెద్ద నిర్మాత‌లు వాళ్ల చేతుల్లో పెట్టుకుని ప‌క్క రాష్ర్టాల్లో వారానికి రూ.2,500 చొప్పున ఒక సి నిమా డిజిట‌ల్ ట్రాన్స్ఫ‌ర్ ఉంటే ఇక్క‌డ రూ.11,000 క్యూబ్ సినిమా థియేట‌ర్స్‌, మ‌ల్టీప్లెక్స్‌లో రూ.13,000 వారానికి తీసుకుంటూ చిన్న, పెద్ద నిర్మాత‌ల‌ను ముంచుతున్నారు. ఈ డిజిట‌ల్ ఇబ్బందుల వ‌ల్ల అస‌లు చిన్న సినిమాలు రిలీజ్ కావ‌డంలేదు. దాదాపు 40వేల మంది ఇండ‌స్ర్టీలో కార్మికులు నాలుగువేల మంది ఇండ‌స్ర్టీలో సిన‌మా ప్రొడ్యూస‌ర్స్, దాదాపు వెయ్యి మంది డైర‌క్ట‌ర్లు, వీరి వ‌ల్ల చాలా ఇబ్బంది ప‌డుతున్నారు. షూటింగ్ లు జ‌రుపుకుని సినిమాలు రిలీజ్‌కాకా నిర్మాత‌ల డ‌బ్బంతా బూడిద‌లో పోసిన ప‌న్నీర‌వుతుంది. దాదాపు సంవత్స‌రానికి 200 తెలుగు సినిమాలు రిలీజ్ అయితే అందులో 150-160 సినిమాలు చిన్న సినిమాలు రిలీజ‌వుతాయి. డిజిట‌ల్ వ్య‌వ‌స్థ‌పైన ఎక్కువ రేట్లు తీసుకుంటూ దాదాపు నెల‌కు రూ.15కోట్లు ఈ ముగ్గురు సంపాదిస్తున్నారు. దానికి గ‌వ‌ర్న‌మెంట్ టాక్స్ కూడా క‌ట్ట‌రు. థియేట‌ర్ లీజ్ విధానం పైన కూడా నెల‌కు రూ.15కోట్లు సంపాదిస్తున్నారు. దానిపైన కూడా గ‌వ‌ర్న‌మెంట్ టాక్స్ క‌ట్ట‌రు.  దోపిడీ విధానం పైన రెండు రాష్ర్టాల ముఖ్య‌మంత్రులు స్పందించి ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న కార్మికుల‌ను, నిర్మాత‌ల‌ను దృష్టిలో ఉంచుకుని లీజ్ విధానాన్ని మ‌రియు డిజిట‌ల్ విధానాన్ని రూపు మాపి స‌మ‌స్య ప‌రిష్క‌రించాల‌ని ఇరు రాష్ర్టాల సీఎం ల‌ను కోరుతున్నాము. 15రోజుల్లో ఈ డిజిట‌ల్ అమౌంట్ వారానికి ఉన్న రూ.11వేలు, రూ.13వేలను త‌గ్గించి ప‌క్క‌రాష్ర్టాల్లో ఉన్న‌ట్లుగా రూ.2,500లు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడ‌ల ఫిలింఛాంబ‌ర్ వ‌ద్ద నిర్మాత‌లు మ‌రియులు కార్మికులు అంతా ఏక‌మై నిరాహార దీక్ష చేస్తామ‌ని హెచ్చ‌రిస్తున్నాం.తెలంగాణ ఫిలించాంబ‌ర్ ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు 9 సినిమాలు సెన్సారయిన‌వి. కాని థియేట‌ర్ల ఇబ్బందుల వ‌ల్ల కేవ‌లం ఒకే ఒక్క సినిమా రిలీజైంది` అని అన్నారు.  నిర్మాత‌ సాయి వెంక‌ట్, జె.వీ.ఆర్ లు కూడా చిన్న సినిమా బ్ర‌తికే వ‌ర‌కూ త‌మ పోరాటం ఆప‌మ‌ని హెచ్చ‌రించారు.