అసలు విషయం ప్రక్కన పెట్టి అందరిని మోసం చేస్తున్నది వాళ్లు


  మేము తెలంగాణ ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ పెట్టి  ప్రారింభించి నాలుగు సంవత్సరాలు అవుతుంది. తెలుగు ఫిలిం ఛాంబర్‌లో మేము కూడా ఉన్నాము. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తరువాత  మేము పెట్టిన టి.ఎఫ్‌.సి.సి. సెంట్రల్‌ గవర్నమెంట్‌ మరియు స్టేట్‌ గవర్నమెంట్‌ అథరైజేషన్‌ కూడా ఉంది. మా ఛాంబర్‌లో నాలుగు సినిమాలను సెన్సార్‌ చేయడం కూడా జరిగింది. అవి 1. అమ్మకు ప్రేమతో, 2. దీక్ష, 3. చిన్న చిన్న ఆశ, 4. కోమలి ఈ నాలుగు సినిమాలకు సెన్సార్‌ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరో 10 సినిమాలు సెన్సార్‌కు రెడీగా ఉన్నాయి. అలాంటి మా టి.ఎఫ్‌.సి.సికి గుర్తింపు లేదనడం సి. కళ్యాణ్‌ గారి తెలివితక్కువ తనానికి నిదర్శనం. మేము సెన్సార్‌ చేస్తున్నట్టు సినిమా పరిశ్రమకు కూడా తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా నిర్మాతల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని 2008లో పదిరోజులు, 2014లో 7రోజులు పరిశ్రమ కోసం నిరాహార దీక్ష చేయడం జరిగింది. అలాంటి మమ్మల్ని అవమానిస్తారా! ఇక మేము పనులు తెలుసుకోండి

ప్రధాని ఆవాస యోజన స్కీం కింద 500 ఇల్లు, ఇల్లులేని నిర్మాతలు, దర్శకులు, ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌కు ఇప్పించడం జరిగింది. అలాగే టెక్నీషియన్స్‌ అందరికి హెల్త్‌కార్డులు కూడా ఇప్పిస్తున్నాం. మా టి.ఎఫ్‌.సి.సిలో దాదాపు దర్శక నిర్మాతలు వెయ్యి మంది వరకు ఉన్నారు. టెక్నీషియన్స్‌ 3 వేల మంది సభ్యులుగా ఉన్నారు. ఇంతవరకు ఏ ఛాంబర్‌ చేయని ఇల్లు ఇప్పించడం లాంటి మంచిపనులు చేశామని  గర్వంగా చెప్పుకుంటాము. కానీ సినిమా ఇండస్ట్రీని కొంతమంది దోచుకుంటున్నారు. నాలుగు సంవత్సరాలు దాటిపోయినా ప్రొడ్యుసర్స్‌ కౌన్సిల్‌ ఎలక్షన్స్‌ జరపకుండా కొందరు ఎంజాయ్‌ చేస్తున్నారు. నిర్మాతల డబ్బులు వృధాగా ఖర్చుపెడుతున్నారు. ఇండస్ట్రీలోనే చాలా మంది నిర్మాతల సినిమాలు రిలీజ్‌ చేయడానికి థియేటర్స్‌ దొరక్క 200 సినిమాలు పూర్తయ్యి రిలీజ్‌కు నోచుకోలేక ఉన్నాయి. అలాగే పక్క రాష్ట్రాల్లో డిజిటల్‌ చార్జీలు వారానికి 2500/- ఉంటే మన దగ్గర వారానికి 11000/- నుండి 13,000 వరకు వసూళు చేస్తున్నారు. వారిలో ముఖ్యంగా ముగ్గురు. 1. సురేష్‌బాబు, 2. అల్లు అరవింద్‌, 3. రమేశ్‌ ప్రసాద్‌ థియేటర్స్‌ వాళ్ల చేతిలోనే ఉంటాయి. లీజ్‌ వ్యవహారాలు వాళ్ల చేతిలోనే ఉంటాయి. డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్‌ కూడా వారి చేతిలో ఉంచుకొని నెలకు దాదాపు 15 కోట్లు కొల్లగొడుతున్నారు. ఇది ప్రభుత్వానికి లెక్క చెప్పరు. టాక్స్‌లు ఉండవు. అంటే ప్రభుత్వాన్నే మోసం చేస్తున్నారు. అసలు సమస్యలను పక్కన పెట్టిపరిశ్రమ కోసం మేము అదిచేస్తున్నాం, ఇది చేస్తున్నాము అంటూ అసలు సమస్యలను పక్కద్రోవ పట్టించడానికి ప్రెస్‌మీట్‌లు పెట్టి నిర్మాతలను  కన్‌ఫ్యూజ్‌ చేస్తున్నారు. దొంగ సభ్యత్వాలు ఇచ్చేది వాళ్లు. ఎలక్షన్స్‌ జరగకుండా చేస్తున్నది వాళ్లు.

మంచి చేసేవాడు ఎప్పుడూ మౌనంగానే ఉంటాడు. చెడు తలంపు ఉన్నవాడు నిర్మాతలను మోసం చేస్తూనే ఉంటాడు. నిర్మాతల శ్రేయస్సు కోరే వాళ్లయితే పక్క రాష్ట్రాల్లో అమలవుతున్న 2500/- డిజిటల్‌ చార్జీని ఇక్కడ ఎందుకు అమలు చేయరు? 11,000/- వేల నుండి 13,000/- వేల వరకు ఎందుకు వసూలు చేస్తున్నారు? కోట్లు దండుకుంటూ వాళ్లు అమలుచేసే డిజిటల్‌ దోపిడిని ఆపి నిర్మాతలకు, సినిమాలకు చేయూతనివ్వడానికి ఎందుకు ముందుకు రావడం లేదు. నిర్మాతల కోసం, సినిమాల విడుదల కోసం పోరాడం చేసింది, చేస్తుంది మేమే. పోరాటం చేయడం వాళ్ల దృష్టిలో తప్పైతే సమస్యలను పరిష్కరించడకుండా పక్కద్రోవ పట్టిస్తున్నవారిని ఏమనాలి. సినీ పరిశ్రమను కాపాడతాం అని చెప్పుకుంటే పోతే సమస్యలు పరిష్కారం కావు. చిన్న నిర్మాతలుగా పరిశ్రమకు వచ్చి, బడా నిర్మాతలైన వాళ్లు ఇప్పుడు అదే చిన్న నిర్మాతను చిన్న చూపు చూస్తున్నారు. మేము రాష్ట్రం రెండుగా విడిపోయిన తరువాత ఆంధ్ర, తెలంగాణ అనే బేధం లేకుండా అందరికి న్యాయం చేయడానికే మేము పోరాటం చేసి తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ను సాధించాము. సాధించిన ప్రతిఫలాలను పదిమందికి పంచుతున్నాము కానీ మేము వంచన చేయడం లేదు. మేము ఒక విషయం చెప్పదలచుకున్నాం. నిర్మాతలను కన్‌ఫ్యూజ్‌  చేయకుండా మీరు కళ్లు తెరవాలి. ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. 

దానికి సంబంధించిన కమిటీ కూడా వేశారు. కానీ, ఆ కమిటి ఏం తేల్చలేకపోవడానికి కారణమేమిటి. గత 20 సంవత్సరాల నుండి ఈ తెలుగు ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సభ్యుడిగా అనేక పదవులు చేసాను. రెండు రాష్ట్రాల నిర్మాతల సెక్టార్‌ చైర్మన్‌గా కూడా చేసాను. కానీ, నేను ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదు. ఏ ఛాంబర్‌ కూడా చేయని పనులు మా తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ చేస్తుంటే ఓర్వలేక మాపై అబండాలను వేస్తున్నారు. పది, పదిహేను మంది కలిసి ఎల్‌.ఎల్‌.పి. అని పెట్టి మొత్తం తెలుగు నిర్మాతలకు నష్టం వచ్చేట్లు చేస్తున్నారు, దోచుకుంటున్నారు. ఈ విషయం సి. కళ్యాణ్‌ గారికే కనిపించలేదా? దీనిపై ఆయన ఎందుకు నోరు మెదపడం లేదు. దీన్ని కూడా మేము సీరియస్‌గా ప్రతిఘటిస్తూ డిజిటల్‌, ఎల్‌.ఎల్‌.పి. థియేటర్స్‌, లీజ్‌ విషయంలో పరిష్కారం చేసి నిర్మాతలను బ్రతికించి మీ నిజాయితిని నిరూపించుకోవాలని సవాల్‌ విసురుతున్నాం.