Latest News

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్ విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న న‌దియా `దేవి` హైత‌మ్ కాలేజ్ లో సంద‌డి చేసిన రాశీ ఖన్నా దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల క్రేజ్ ని వాడుకుంటున్నారు, సాయి పల్లవి సినిమాకి టైటిల్ గా 'హేయ్ పిల్లగాడా' సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ విడుదల తేదీ ప్రకటించిన వివేకం చిత్ర యూనిట్. తెలుగులో వీఐపీ2 విడుదల తేదీ ఖరారైంది. నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా

నవంబర్ 1 న `రెమో` ఆడియో రిలీజ్‌


శివ‌కార్తికేయ‌న్‌, కీర్తిసురేష్ జంట‌గా బ‌క్కియ రాజ్ క‌న్న‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన లవ్  ఎంట‌ర్‌టైన‌ర్ `రెమో`. ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో 24 ఎ.ఎం.స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ఆర్‌.డి.రాజా స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు విడుద‌ల చేస్తున్నారు.  ఈ సినిమా ఆడియో నవంబర్ 1 న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. 
 
దిల్ రాజు మాట్లాడుతూ - ``హీరో శివ‌కార్తికేయ‌న్ రెమో సినిమాలో మూడు వేరియేష‌న్స్‌లో అద్భుతంగా యాక్ట్ చేశాడు. పి.సి.శ్రీరాంగారి సినిమాటోగ్ర‌ఫీ, అనిరుధ్ సంగీతం సినిమాకు మ‌రింత స‌పోర్ట్ చేశాయి. రెమో ష్యూర్ షాట్ హిట్ మూవీ అవుతుంది. డెబ్యూ డైరెక్ట‌ర్ బక్కియ రాజ్ క‌న్న‌న్ చేసిన సినిమా త‌మిళనాడులో 65-70 కోట్లు క‌లెక్ట్ చేయ‌డం చిన్న విష‌యం కాదు. రెమో సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి ఎంట‌ర్ అవుతున్న శివ‌కార్తికేయ‌న్‌కు అభినంద‌న‌లు. ఈ చిత్రం ఆడియో నవంబర్ 1 న విడుదల అవుతుంది`` అన్నారు.