అన‌సూయ అందుకే డేటింగ్ చేయ‌ట్లేదా..?


డేట్ విత్ అనసూయ అంటూ.. ఓ న్యూస్ ఛానల్ లో ప్రోగ్రాం టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. ఓ మూడు నెలల క్రితమే ఈ కార్యక్రమం ప్రారంభం కాగా.. కొన్నివారాలుగా ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కావడం లేదు. మొదట్లో రేటింగ్ బాగానే ఉన్నా.. ఆ తర్వాత రెస్పాన్స్ తగ్గిపోవడం.. టీఆర్పీలు పడిపోవడంతోనే డేట్ విత్ అనసూయను ఛానల్ వాళ్లు నిలిపేశారనే టాక్ ఉంది. ప్రారంభంలో ఇంట్రెస్టింగ్ గా అనిపించినా.. మెల్లగా ఇతర కార్యక్రమాల మాదిరిగానే సాగడంతోనే.. టీఆర్పీలు పడిపోయాయని ఛానల్ జనాలు అనుకుంటున్నారట.
 
అయితే.. అనసూయ వర్గాల సైడ్ నుంచి వెర్షన్ వేరేలా ఉంది. ప్రస్తుతం సినిమా షూటింగులతో బిజీగా ఉండడం వల్లే.. టీవీషోను షూట్ చేయలేకపోయారట. అందుకే ఆ ప్రోగ్రామ్ మిస్ అయిందట అనసూయ. సాయిధరం తేజ్ తో విన్నర్ మూవీలో చేస్తుండడంతో డేట్స్ అటు కేటాయించేసిందట అనసూయ. విన్నర్ లో ఐటెం సాంగ్ కి సై అన్నాక.. వరుసగా ఆఫర్స్ క్యూ కట్టేస్తున్నాయని టాక్.