ఆ విషయంలో సూపర్ స్టార్ కన్నా, యంగ్ టైగర్ బెటర్ !


యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తెలుగు నాట ఈ పేరుకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అతి తక్కువ వయసులోనే విపరీతమైన స్టార్ డం సొంతం చేసుకున్న ఈ నందమూరి చిన్నోడు అప్పట్లో తన ప్రమేయం లేకుండానే చాల చిక్కుల్లో పడ్డాడు. అయితే అవన్నీ తారక్ తక్కువ వయసులో బ్యాలెన్సింగ్ గా ఆలోచించక పోవడం వల్ల వచ్చిన సమస్యలే అని చెప్పుకోవచ్చు. అయితే కొడుకు పుట్టిన తరువాత నుండి ఎన్టీఆర్ ఆలోచన విధానంలో చాలా మార్పు వచ్చింది. ఏ విషయం మీద అయినా ఆచి తూచి స్పందించడం, క్లారిటీ గా మాట్లాడటం అలవాటు చేసుకున్నాడు. ఇలా ఆలోచించే మెచ్యూరిటీ రావడం వల్లే ఇప్పడు తారక్ ఒక సమస్య నుండి బయటపడ్డాడట!

ntrరీసెంట్ గా ప్రత్యేక హోదా ఉద్యమానికి తెలుగు నాట చోటా మోటా హీరోలంతా తమ మద్దతు తెలిపారు. ఇక స్టార్స్ లో అయితే ఒక్క పవర్ స్టార్ తప్ప ఇంకెవ్వరు ప్రత్యేక హోదా కి మద్దతు తెలిపిన పాపాన పోలేదు. ఇక మన సూపర్ స్టార్ మహేష్ అయితే తమిళనాడు జల్లికట్టు కి మద్దతు తెలిపి.. హోదా పోరులో ఒక్క ట్వీట్ కూడా చేయకుండా మౌనం వహించాడు. అయితే ఇక్కడే ఎన్టీఆర్ మహేష్ కన్నా తెలివిగా ఆలోచించాడు అని తెలుస్తుంది. ముందుగా ఎన్టీఆర్ కూడా జల్లికట్టు కి మద్దతుగా ట్వీట్ చేద్దాం అని నిర్ణయించుకున్నాడట . అయితే కాస్త ఆగి స్పందిద్దాం అని తారక్ బ్యాక్ స్టెప్ వేసినట్టు తెలుస్తుంది. అయితే అలా బ్యాక్ స్టెప్ వేయడమే ఎన్టీఆర్ ని సేఫ్ జోన్ లోకి నెట్టింది. జల్లికట్టు గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కాబట్టి, హోదా విషయంలో కూడా ఎన్టీఆర్ స్పెసిఫిక్ గా స్పందించాలని ఎవరు డిమాండ్ చేయలేదు. కాబట్టి హోదా పోరు జరుగుతున్నా, ఎన్టీఆర్ ఆ విషయంలో తప్పించేసుకున్నాడు.

అలా కాకుండా ఎన్టీఆర్ హోదా విషయంలో మద్దతు తెలిపి ఉంటే , ఇప్పటికే పోలిటికల్ గా టిడీపీ కి దూరం అయిన తారక్... మరింత దూరం అయ్యే వాడని, బాబాయి తో ఈ అబ్బాయి అనుబంధం మరింత చెడేది అని అంతా చర్చించుకుంటున్నారు. ఏదేమైనా తన ఫ్యామిలీ కోసం తారక్ హోదా విషయంలో ఇలానే మౌనంగా ఉంటాడో, లేక తనని స్టార్ ని చేసిన తెలుగు ప్రజల కోసం ఏ నాటికి అయినా ప్రజల మధ్యకు వస్తాడో తెలియాలంటే మరి కొంత కాలం ఆగవలిసిందే. http://www.filmjalsa.com/nani-and-keerthy-suresh-in-nenu-local/