మోక్ష‌జ్క్ష గురించి ఆ విష‌యం ఎందుకు చెప్ప‌ట్లేదు?


నందమూరి అభిమానులంతా మోక్షేజ్ఞ ఎంట్రీ కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో అందరికి తెలిసిందే . అందుకు తగ్గట్టుగానే ఈ ఏడాది చివర్లో మోక్షజ్ఞను సినీ రంగానికి పరిచయం చేయాలని నందమూరి బాలకృష్ణ డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. మొదట్లో.. మోక్షజ్ఞ అరంగేట్రానికి ఇంకా సమయముందని బాలయ్య అనుకున్నప్పటికీ.. అభిమానుల ఒత్తిడి కారణంగా మనసు మార్చుకున్నాడు అని సమాచారం . ఇక తన కుమారుడు మొదటి సినిమా కోసం బాలయ్య ఇప్పటికే కొంతమంది డైరెక్టర్‌లతో చర్చలు కూడా ప్రారంభించాడు.ఇక పనిలో పనిగా మోక్షజ్ఞ ఇప్పటికే ఓ ప్రముఖ కొరియోగ్రాఫర్‌ వద్ద డ్యాన్స్‌లో శిక్షణ పూర్తి చేసుకున్నాడట.ఈ ఏడాది చివరకు తన ‘ఆదిత్య 369’కు సీక్వెల్‌ సినిమా ద్వారా మోక్షజ్ఞను అరంగేట్రం చేయిద్దామనుకుంటున్నాడట బాలయ్య. ఇంత వరకు అంతా బాగానే ఉన్నా ఇప్పుడు ఈ నందమూరి మూడో తరం వారసుడికి పెద్ద కష్టం వచ్చి పడిందట .

మోక్షజ్ఞను ప్రస్తుతం బరువు సమస్య వేధిస్తోందట. మోక్షజ్ఞ ఈ మధ్య కాలంలో కాస్త లావయ్యాడట. ప్రస్తుతం తన బరువు తగ్గించుకునే పనిలో మోక్షజ్ఞ బిజీగా ఉన్నాడని సమాచారం. అయితే అధిక బరువు అన్నది నందమూరి హీరోలకి పెద్ద ఇబ్బంది కాకపోవచ్చు అన్న టాక్ కూడా వినిపిస్తుంది. బాలయ్య , ఎన్టీఆర్ , హరికృష్ణ , నారా రోహిత్ వంటి నందమూరి హీరోలంతా సాలిడ్ గా ఉంది కూడా సాలిడ్ హిట్స్ కొట్టినవారే . అయితే ఇవేమి పట్టించుకోని మోక్షేజ్ఞ తన ఫిజిక్ పై ద్రుష్టి పెట్టి ఇప్పుడు 6 ప్యాక్ కి ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇంత కష్టపడుతున్న మోక్షజ్ఞ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవడానికి ఎంతో దూరంలో దూరంలో లేదు అన్నది యిట్టె అర్ధం అయిపోతుంది కదూ