విజయ్‌తో మ‌ల్టీస్టార‌ర్ అందుకే వ‌ద్ద‌నుకున్నా- మ‌హేష్ బాబు


బ్ర‌హ్మోత్స‌వం ఫ్లాప్ త‌ర్వాత మ‌హేష్ బాబు- మురుగదాస్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న స్పైడ‌ర్ సినిమా తెలుగు, త‌మిళ భాష‌ల్లో రిలీజ్ కానున్న విష‌యం విదిత‌మే. ఈ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ కూడా ఆల్రెడీ వ‌చ్చేసింది. ఈ నేప‌థ్యంలోనే మ‌హేష్ త‌మిళ ప్రముఖ మ్యాగ‌జైన్ కు ఇంట‌ర్వూ ఇచ్చాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ఓ ప్ర‌శ్న ఎదురైంది. గ‌తంలో మ‌ణిరత్నం డైర‌క్ష‌న్ లో చేయ‌వ‌ల‌సిన పొన్నియ‌న్ సెల్వం ఎందుకు సెట్స్ పైకి వెళ్ల‌లేదు అన్న‌దే ప్ర‌శ్న‌.

విజ‌య్‌-మ‌హేష్ కాంబినేష‌న్ లో పొన్నియ‌న్ సెల్వం అనే సినిమాను మ‌ల్టీస్టార‌ర్ గా తెర‌కెక్కంచాల‌న్న‌ది మ‌ణిర‌త్నం అస‌లు ప్లాన్. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తి చేశారు కానీ, ఆ సినిమా ప‌ట్టాలెక్కి సెట్స్ వ‌ర‌కు వెళ్ల‌కుండానే ఆగిపోయింది. ఈ ప్ర‌శ్నకు మ‌హేష్ త‌నదైన శైలిలో వివ‌ర‌ణ ఇచ్చారు. పొన్నియ‌న్ సెల్వం అనేది మ‌ల్టీస్టార‌ర్ గా తెర‌కెక్కాలి కాబ‌ట్టి, తాను మొద‌టి సారి త‌మిళంలో చేసే సినిమా సోలో గా చేయాల‌న్న ఉద్దేశ్యంతోనే  ఆ సినిమా సెట్స్ వ‌ర‌కు వెళ్ల‌లేద‌ని, విజ‌య్ తనకు మంచి స్నేహితుడ‌ని చెప్పాడు మ‌హేష్‌.