శాతకర్ణి కలక్షన్స్ లెక్కలు ఎందుకు దాస్తున్నారు ?


సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన బాలయ్య వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి రికార్డ్స్ క్రియేట్ చేసింది . అయితే ఈ సినిమా ప్రారంభమైన మొదట్నుంచి క్రిష్‌ను బాలయ్య, బాలయ్యను క్రిష్ పొగడ్తల వర్షంలో ముంచెత్తారు. అతి తక్కువ సమయంలోనే క్రిష్ ఈ సినిమాని కంప్లీట్ చేయడం తో బాలయ్య కూడా క్రిష్ ని బాగానే నమ్మాడు . అయితే సినిమా విడుదల అయ్యాక పరిస్థితి పూర్తిగా మారిపోయిందట . ఇప్పుడు క్రిష్‌పై బాలయ్య అసహనం వ్యక్తం చేస్తున్నాడట . శాతకర్ణి సూపర్ సక్సస్ అయి మంచి కలక్షన్స్ రాబట్టినా ఇప్పటిదాకా చిత్ర బృందం కలెక్షన్ల వివరాలను మాత్రం బయటపెట్టలేదు. అదే సమయంలో చిరంజీవి 150వ సినిమా ఖైదీ నంబర్ 150 కలెక్షన్లు 100 కోట్ల మార్కును దాటేశాయని.. అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించేశాడు ! అదే బాలయ్య అసహనానికి కారణమైందట. శాతకర్ణి సినిమా కలెక్షన్ల వివరాలను ఎందుకు బయటపెట్టట్లేదని క్రిష్‌ను బాలయ్య ముందుగా ఎన్నో సార్లు ప్రశ్నించాడట. అయినా ఇటు క్రిష్ కానీ, మిగతా నిర్మాతలు కానీ వాటి వివరాలను వెల్లడించకపోవడం బాలయ్యకు ససేమిరా నచ్చలేదట. అందుకే క్రిష్‌పై అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాడని సమాచారం . ఇప్పటికే క్రిష్ సహా గౌతమిపుత్ర శాతకర్ణి చిత్ర నిర్మాతలపై ఐటీ సోదాలు జరిగిన నేపథ్యంలో ఇలా అయినా కలక్షన్స్ ఉద్దేశంతోనే ఈ దాడుల వెనుక బాలయ్య హస్తం ఉండవచ్చు అని కొంత మంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు . అయితే తనకి తన 100 వ సినిమాని జీవితాంతం గుర్తుంది పోయేలా తెరకెక్కించిన క్రిష్ పై బాలయ్య ఇలాంటి స్టాటజీ ఉపయోగించాడు అన్నది నమ్మశక్యంగా లేకపోయినా, ఇప్పటికీ శాతకర్ణి కలక్షన్స్ లెక్క తెలియకపోవడం నందమూరి అభిమానులను బాధపెట్టేస్తుంది.