అఖిల్-శ్రియా పెళ్లి ర‌ద్దు.. తెర‌పైకి మ‌రో కార‌ణం


ఎంతో అంగ‌రంగ వైభవంగా జ‌రిగిన అఖిల్ అక్కినేని, శ్రియా భూపాల ల నిశ్చితార్థం, పెళ్లి వ‌ర‌కు వ‌చ్చి ర‌ద్ద‌వుతుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. ఇరు కుటుంబాల మ‌ధ్య మంచి సంబంధాలుండ‌ట‌మే దీనికి కార‌ణం. పెళ్లి ర‌ద్దు అని వార్త వ‌చ్చిన వెంట‌నే అంద‌రూ ఇదంతా కేవ‌లం రూమ‌రే అనుకున్నారు కానీ త‌ర్వాత్త‌ర్వాత అదే నిజ‌మ‌ని తేలింది. అయితే ఈ పెళ్లి రద్దు గురించి రోజుకో వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అఖిల్, శ్రియ భూపాల్ మ‌రియు ఆమె త‌ల్లితో ఎయిర్‌పోర్ట్ లో గొడ‌వ ప‌డ్డాడ‌ని, దీంతో అఖిల్-శ్రియా ల మ‌ధ్య చిన్న చిన్న ఇగో క్లాషెస్ వ‌ల్లనే బ్రేకప్ వ‌ర‌కు వెళ్లింద‌ని ప్ర‌చారాలు జ‌రిగాయి. ఆ త‌ర్వాత నాగ్ ఫ్యామిలీలో ఆస్తుల పంప‌కం దగ్గ‌ర ఇరు కుటుంబాల మ‌ధ్య వివాదం అని అన్నారు. కానీ ఇప్పుడు అఖిల్-శ్రియా పెళ్లి ర‌ద్దుకు మ‌రో కొత్త కార‌ణం వినిపిస్తోంది. 

తొలి సినిమాతోనే ఘోర అప‌జ‌యం ఎదుర్కొన అఖిల్, త‌న రెండో సినిమా పూర్తి చేసి, దానితో అయినా నిల‌దొక్కుకుని అప్పుడు పెళ్లి చేసుకుంటాన‌ని అఖిల్ డిసైడ్ అయ్యాడ‌ట‌. అస‌లే చిన్న వ‌య‌సులో పెళ్లి చేసుకుంటున్నందుకు అఖిల్ మీద విమ‌ర్శ‌లు రావ‌డంతో, రెండో సినిమాతో అయినా మంచి హిట్ కొట్టి,ఆ త‌ర్వాత పెళ్లి చేసుకుంటాన‌ని అనుకున్న అఖిల్ నిర్ణ‌యానికి శ్రియ ఫ్యామిలీ ఒప్పుకోలేద‌ట‌. మేలో అనుకున్న పెళ్లిని టైమ్ ప్ర‌కార‌మే జ‌రిపించాలని ప‌ట్టుపట్ట‌డంతోనే పెళ్లి ర‌ద్దు చేసుకున్నార‌నే కొత్త కార‌ణం ఇప్పుడు ఫిల్మ్ న‌గ‌ర్ లో వినిపిస్తుంది. పెళ్లి ర‌ద్దుపై మొద‌ట్లో ఇరు కుటుంబాలు కాస్త అప్‌సెట్ అయినా, ప్ర‌స్తుతం సైలెంట్ అయిపోయాయి. అఖిల్ రెండో సినిమా షూటింగ్ లో బిజీగా ఉండ‌గా, శ్రియా ఎన్నారైతో పెళ్ళికి రెడీ అవుతుంది.