Rayudu Coming on this 27th


Vishal's RAYUDU After super hit movies like Prema chadarangam , Pandem kodi & other movies ,again vishal is hitting Telugu zone with his new film RAYUDU. On this May -27th vishal's Rayudu will be released in Telugu. Mass Hero Vishal , Heroine SriDivya are lead roles in Rayudu. Muthayya is the director of Rayudu Under Vishal's production. This film is distributing in Telugu by famous distribution banner Hari Venakteswara pictures.G.Hari is the head of this banner. Today i.e, May20th this film is released in Tamil Version and had huge openings at box office as well as marked hit talk at Tamil industry. This movie has highest openings record in Vishal's Career. In Telugu RAYUDU will be released on May-27th.This movie got great response from the begining of the Audio. Rayudu team is expecting same result in Telugu industry as well.. Hero Vishal Narrates Rayudu " Rayudu movie is all about a war between local politician and a common Load man in a market " . Out and out Rayudu is a complete commercial mass movie entertainer. FilmJalsa wishes Rayudu team all the good luck in Telugu Version as well..
మే 27న మాస్‌ హీరో విశాల్‌ 'రాయుడు'
మాస్‌ హీరో విశాల్‌, శ్రీదివ్య హీరోహీరోయిన్లుగా ముత్తయ్య దర్శకత్వంలో రూపొందుతున్న మాస్‌ ఎంటర్‌టైనర్‌ 'రాయుడు'. విశాల్‌ సమర్పణలో రూపొందిన ఈ చిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం తమిళ్‌లో విడుదలై భారీ ఓపెనింగ్స్‌ సాధించి సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. మే 27న ఈ చిత్రం  తెలుగులో విడుదలవుతోంది.
'రాయుడు' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ అధినేత జి.హరి మాట్లాడుతూ - ''ఈరోజు తమిళనాడులో విడుదలైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్‌ సాధించడమే కాకుండా సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. విశాల్‌ కెరీర్‌లోనే హయ్యస్ట్‌ ఓపెనింగ్స్‌ సాధించి రికార్డు క్రియేట్‌ చేస్తోంది. తెలుగులో ఈ చిత్రాన్ని మే 27న రిలీజ్‌ చేస్తున్నాం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకు చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. తెలుగులో కూడా ఈచిత్రం ఘనవిజయం సాధిస్తుంది'' అన్నారు.
మాస్‌ హీరో విశాల్‌ మాట్లాడుతూ - ''మార్కెట్‌లో పనిచేసే ఒక లోడ్‌మెన్‌కి లోకల్‌ పొలిటీషియన్‌కి మధ్య జరిగే వార్‌ ఏవిధంగా ఉంటుందో 'రాయుడు'లో చూపిస్తున్నాం. తమిళ్‌ వెర్షన్‌కి మధురై బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఓ స్టోరీ. అదే ఫ్లేవర్‌ మిస్‌ అవకుండా అనంతపూర్‌ రాప్తాడు విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే విధంగా తెలుగులో వుంటుంది. ఔట్‌ అండ్‌ ఔట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం తమిళ్‌లో ఘనవిజయం సాధించింది. తెలుగులో కూడా పెద్ద హిట్‌ అవుతుందన్న కాన్ఫిడెన్స్‌తో వున్నాను'' అన్నారు.