డార్జిలింగ్ లో రవితేజ "రాజా ది గ్రేట్" షూటింగ్.


రవితేజ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘రాజా ది గ్రేట్‌’. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. శిరీశ్ నిర్మిస్తున్నారు. ‘వెల్‌కమ్‌ టు మై వరల్డ్‌’ అనేది క్యాప్షన్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ డార్జిలింగ్ లో జరుగుతుంది. ఈ నెల 28 వరకు డార్జిలింగ్ లో షూటింగ్ షెడ్యూల్ ని పూర్తి చేస్తాం అని చిత్ర యూనిట్ పేర్కొంది. రవితేజ, మెహరీన కౌర్‌ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు సమర్పణ: దిల్‌రాజు, నిర్మాత: శిరీశ, కథ, మాటలు, స్ర్కీనప్లే, దర్శకత్వం: అనిల్‌ రావిపూడి.