Ravi Teja Show Interest To Remake Bollywood Film


Last year Ravi Teja acted in 'kick2' and 'Bengal tiger' which are not successful at the box office. Now,Ravi teja is taking care for his future projects. In this process Ravi Teja interested to remake a Bollywood film "jolly L.B.B" which is released 3 years back. Raviteja want to remake this movie in Telugu. Adarsh vamshi and Boman Iraani are key roles in the movie which is super hit at the Bollywood box office, Raviteja thought that lawer character in the movie suits him and showing interest to remake the movie says the sources of film nagar.
బాలీవుడ్ రీమేక్ పై క‌న్నేసిన ర‌వితేజ‌
 
గ‌తేడాది ర‌వితేజ న‌టించిన కిక్2, బెంగాల్ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద అనుకున్నంత విజ‌యాన్ని సాధించ‌క‌పోవ‌డంతో ఇప్పుడు కొత్త సినిమాల ఎంపిక‌లో రవితేజ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. ఈ క్ర‌మంలో మ‌నోడు ఓ బాలీవుడ్ సినిమాను రీమేక్ చేసే ఉద్దేశంలో ఉన్నాడ‌ట‌. మూడేళ్ల క్రితం వ‌చ్చిన 'జాలీ ఎల్.ఎల్.బి' చిత్రంపై మ‌న‌సు పారేసుకున్న ర‌వితేజ ఆ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయాల‌ని చూస్తున్నాడ‌ట‌. అర్ష‌ద్ వ‌ర్శి, బోమ‌న్ ఇరానీ ముఖ్య పాత్ర‌ల్లో తెర‌కెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్ హిట్ టాక్ అందుకుంది. ఈ స్టోరీ, సినిమాలోని లాయ‌ర్ క్యారెక్ట‌ర్ త‌నకు బాగా న‌ప్పుతాయ‌ని ర‌వితేజ భావించి, దీనిపై దృష్టి పెట్టిన‌ట్లు ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాలు అంటున్నాయి.