మాస్ మ‌హ‌రాజా ఇక సినిమాలు చేయడా..?


మాస్ మ‌హారాజ ర‌వితేజ దాదాపు సంవ‌త్స‌రం నుంచి సినిమాల‌కు దూరంగా ఖాలీగా ఉంటున్నాడు. త‌న చివ‌రి సినిమా బెంగాల్ టైగ‌ర్. ఆ సినిమా రిలీజ్ అయి కూడా సంవ‌త్స‌రం అయింది. కానీ ఇప్ప‌టివ‌ర‌కు ర‌వితేజ త‌న త‌ర్వాత సినిమా గురించి ఎక్క‌డా ప్ర‌స్తావించింది లేదు. అంతేకాదు త‌న త‌ర్వాతి సినిమా గురించి ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డా చెప్ప‌క‌పోవ‌డంతో ఒక్కొక్క‌రికి ఒక్కో అనుమానం వ‌స్తుంది. అస‌లు ర‌వితేజ సినిమాలు చేస్తాడా, చేయ‌డా అనే అనుమానాలు సైతం వ్య‌క్తం అవుతున్నాయి. అంతేకాదు మాస్ మహారాజ త‌న అనారోగ్య ప‌రిస్థితుల కార‌ణంగా సినిమాల‌కు దూరంగా ఉంటున్నాడ‌ని కొంద‌రు అంటుంటే, ఇప్ప‌టివ‌ర‌కు త‌న కుటుంబం తో ఎక్కువ కాలం గ‌డ‌ప‌క‌పోవ‌డంతో ఇప్పుడు ఆ స‌మాయాన్ని త‌న కుటుంబానికి కేటాయిస్తున్నాడ‌ని మ‌రికొంద‌రు అంటున్నారు. ఇంకొందరు అయితే ర‌వితేజ ఇక‌పై సినిమాలు చేయ‌బోడని, త‌న ఆరోగ్యం స్థిమిత ప‌డ‌టానికి ఇప్ప‌టికే సుమారు ప‌ది దేశాలు తిరిగాడ‌ని, అయినా త‌న ఆరోగ్యం కుదుట‌ప‌డ‌ద‌లేని .. ర‌వితేజతో సినిమాలు చేయ‌డానికి ప‌లువురు ద‌ర్శకులు ఆస‌క్తి చూపుతున్న‌ప్ప‌టికీ, ర‌వితేజ మాత్రం ఆస‌క్తి చూప‌డం లేద‌ని అంటున్నారు. ఇప్ప‌టికైనా ఈ రూమ‌ర్స్ పైన క‌నీసం ర‌వితేజ స‌న్నిహితులు ఒక ప్ర‌క‌ట‌న ఇస్తే బాగుండ‌ని అనుకుంటున్నారు మాస్ మ‌హారాజ ఫ్యాన్స్.