Latest News

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్ విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న న‌దియా `దేవి` హైత‌మ్ కాలేజ్ లో సంద‌డి చేసిన రాశీ ఖన్నా దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల క్రేజ్ ని వాడుకుంటున్నారు, సాయి పల్లవి సినిమాకి టైటిల్ గా 'హేయ్ పిల్లగాడా' సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ విడుదల తేదీ ప్రకటించిన వివేకం చిత్ర యూనిట్. తెలుగులో వీఐపీ2 విడుదల తేదీ ఖరారైంది. నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా

Rao Ramesh Dream Role..


టాలీవుడ్ లో త‌న‌కు, త‌న న‌ట‌న‌కూ ఓ ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్నాడు రావు ర‌మేష్. సినిమా, సినిమాకు త‌నదైన శైలిలో విభిన్న‌త చూపిస్తూ, ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నాడు. టాలీవుడ్ లో ప్ర‌స్తుతం ఎక్కువ మొత్తంలో రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న క్యార‌క్ట‌ర్ ఆర్టిస్టుల్లో రావు ర‌మేష్ ఒక‌డంటే అతిశ‌యోక్తి లేదు. అంద‌రినీ త‌న న‌ట‌న‌తో మెప్పించిన ఆయ‌న‌కు ఒక డ్రీమ్ రోల్ ఉంద‌ట‌. ఎవ‌రూ అలాంటి పాత్ర చేయ‌మ‌ని అడ‌గ‌డం లేద‌ట‌. మోటుగా ఉండే విల‌న్ పాత్ర చేయాల‌ని రావు ర‌మేష్ కి కోరిక అట‌. ఆ పాత్ర త‌న‌లోని న‌టుడిని మ‌రింత బ‌య‌ట‌కు తెస్తుంద‌ని ఆయ‌న న‌మ్మ‌కం.  ఎవ‌రైనా అలాంటి క్యారెక్ట‌ర్ ఇస్తే చేయ‌డానికి నేను సిద్ధం అంటున్నాడు రావు ర‌మేష్. మరి ఇలాంటి మోటు విలన్ క్యారెక్ట‌ర్ ని ఆయ‌న‌కు ఎవ‌రు క‌ల్పిస్తారో చూడాలి.