Latest News

ఆగష్టు 19 న మంచు మనోజ్ ' ఒక్కడు మిగిలాడు ' ట్రైలర్ విడుదల ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా వి.ఎస్‌.క్రియేటివ్‌ వర్క్స్ బేన‌ర్‌పై కొత్త చిత్రం ప్రారంభం నేడే పైసా వసూల్ ఆడియో విడుదల బిగ్ బాస్ షోలో సంద‌డి చేసిన తాప్సీ దసరా రేసులో శర్వానంద్ నాగచైతన్య ' యుద్ధం శరణం ' రిలీజ్ డేట్ ఫిక్స్ ఆగష్టు 24న‌ శ‌ర్వానంద్‌, యు.వి.క్రియేషన్స్, మారుతి "మ‌హ‌నుభావుడు" ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌ సెప్టెంబరు మొదటివారంలో మేడమీద అబ్బాయి నెపోలియన్‌' ట్రైలర్‌ విడుదల చేసిన హీరో సందీప్ కిష‌న్‌, నిర్మాత కె.ఎల్‌.దామోద‌ర్ ప్ర‌సాద్‌ `ద‌ళ‌ప‌తి`లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న శ్రేయా ఘోష‌ల్ సాంగ్

‘రంగం’ రేంజ్‌ చిత్రం ‘రంగం-2’


జీవా హీరోగా సినిమాటోగ్రాఫర్‌ టర్న్‌డ్‌ డైరెక్టర్‌ కె.వి.ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందిన ‘రంగం’ ఎంతటి సంచలన విజయం సాధించిందో.. దర్శకుడిగా మారిన సినిమాటోగ్రాఫర్‌ రవి.కె.చంద్రన్‌ దర్శకత్వం వహించిన ‘రంగం-2’ చిత్రం కూడా అంతటి ఘన విజయం సాధించడం ఖాయమని యువ దర్శక సంచలనం ‘సోగ్గాడే చిన్ని నాయనా’ఫేం కళ్యాణ్‌కృష్ణ అన్నారు.
జీవా-తులసీనాయర్‌ జంటగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్  రవి.కె.చంద్రన్ దర్శకత్వంలో, హ్యారిస్‌ జైరాజ్‌ సంగీత సారధ్యంలో రూపొందిన ‘రంగం-2’ చిత్రం ఫస్ట్‌ లుక్‌ కళ్యాణ్‌కృష్ణ విడుదల చేశారు.
రవి.కె.చంద్రన్‌- హ్యారిస్‌ జైరాజ్‌ వంటి టాప్‌ టెక్నీషియన్స్‌ పని చేయగా, తమిళంలో మంచి విజయం సాధించి తెలుగులో ‘రంగం-2’ పేరుతో వస్తున్న ఈ చిత్రం ఇక్కడ కూడా ఘన విజయం సాధించాలని, నిర్మాతగా ఎ.ఎన్‌.బాలాజీకి (సూపర్‌గుడ్‌ బాలాజీ) మంచి పునాది కావాలని కళ్యాణ్‌కృష్ణ ఆకాంక్షించారు.
స్‌రాజ్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో` శ్రీలక్ష్మిజ్యోతి క్రియేషన్స్‌ పతాకంపై ఎ ఎన్‌.బాలాజి (సూపర్‌గుడ్‌ బాలాజి) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఫస్ట్‌ లుక్‌ లాంచ్‌ కార్యక్రమంలో కళ్యాణ్‌కృష్ణతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్‌ సాయిబాబా, ప్రముఖ నిర్మాత కె.వి.వి.వేణు, ‘రంగం-2’ నిర్మాత ఎ ఎన్‌.బాలాజీ పాల్గొన్నారు.
విడుదల చేసిన మూడు రోజుల్లోనే మూడున్నర లక్షల వ్యూస్‌ రావడం బట్టి ‘రంగం-2’ చిత్రానికి గల క్రేజ్‌ అర్ధమవుతుందని కె.వి.వి.వేణు అన్నారు.
‘రంగం-2’ వంటి ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తుండడం ఎంతో గర్వంగా ఉందని నిర్మాత ఎ ఎన్‌.బాలాజీ (సూపర్‌ గుడ్‌ బాలాజీ) తెలిపారు.
నాజర్‌, జయప్రకాష్‌, ఊర్మిళ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌, కెమెరా: మానుష్‌ నందన్‌, మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, పాటలు: వెన్నెలకంటి, సంగీతం: హ్యారిస్‌ జైరాజ్‌, సమర్పణ: జస్‌రాజ్‌ ప్రొడక్షన్స్‌, నిర్మాత: ఎ ఎన్‌.బాలాజీ, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: రవి.కె.చంద్రన్‌!!