తేజ కోసం పూర్తి సమయాన్ని కేటాయిస్తున్న రానా


ఇన్ని రోజులు ‘బాహుబలి’ సినిమా చిత్రీకరణతో, ఆ సినిమాకు సంబందించిన ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉన్న రానా, దర్శకుడు తేజతో చేస్తున్న ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా షూటింగ్ కి పూర్తి సమయం కేటాయించలేకపోయాడు. ఈ కారణం చేత దర్శకుడు తేజ కూడా చాలా నెమ్మదిగా చిత్రీకరణ చేస్తూ వచ్చారు. ఇప్పుడు సెన్సార్ తో సహా బాహుబలి పనులన్నీపూర్తి అవటంతో రానా చాలా వరకు ఫ్రీ అయ్యారు. వీలైనంత వరకు ఉన్న సమయం మొత్తాన్ని తేజ సినిమా కోసమే కేటాయించాలని నిర్ణయం తీసుకున్నాడు.


రానా ఇప్పుడు పూర్తిగా ప్రాజెక్టులోకి దిగిపోవడంతో చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. నిన్న సినిమాలోనే కీలకమైన సన్నివేశాల్ని పూర్తిచేశారు యూనిట్. కర్నూలు టౌన్ లోని పలు ఏరియాల్లో వీటిని చిత్రీకరించారు. ఈ షూటింగ్లో రానా, శివాజీరాజా, ఇతర కీలక నటులు పాల్గొన్నారు. కాజల్ అగర్వాల్, క్యాథరిన్ థ్రెసాలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ ను రానా తండ్రి, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్వాతంత్య్ర దినోత్సవ సందర్బంగా ఆగష్టు 15న రిలీజ్ చేయనున్నారని సమాచారం.