Rana Not Available For Teja


తేజ‌కు క‌నిపించ‌కుండా తిరుగుతున్న రానా
పోయిన ఫామ్ తిరిగి తెచ్చుకోవాలంటే క‌ష్ట‌మే. త‌న ఫామ్ లోకి తాను మ‌ళ్లీ రావాల‌ని డైర‌క్ట‌ర్ తేజ తెగ ప్ర‌య‌త్నాలు చేసేస్తున్నాడు. అందులో భాగంగానే కొత్త ప్రాజెక్టుల‌ను తెగ అనౌన్స్ చేసేస్తున్నాడు. పెద్ద హీరోల‌తో అయితే పేరొస్తుంద‌నుకుంటున్నాడో ఏమో తెలియ‌దు కానీ అందులో ఒక సినిమా రానా తో కూడా ప్లాన్ చేసి, రానా తో ల‌వ్ స్టోరీ తీయ‌బోతున్నాని, షూటింగ్ కూడా త్వ‌ర‌లోనే మొద‌లైపోతుంద‌ని చెప్పాడు తేజ‌. కానీ రానా ఏమో తేజ‌కు క‌నిపించ‌కుండా తిరిగేస్తున్నాడ‌ట‌. అదేంటి అనుకుంటున్నారా..
రానా ద‌గ్గుబాటి. నిజం చెప్పాలంటే బాహుబ‌లి సినిమాతో ప్ర‌భాస్ కంటే ఎక్కువ క్రేజ్ వ‌చ్చింది రానా కే. బాహుబ‌లి విజ‌యంతో బాహుబ‌లి2 ని తెర‌కెక్కిస్తున్న నేప‌థ్యంలో రానా జ‌క్క‌న్న కి వ‌రుస‌గా డేట్స్ ఇచ్చేశాడ‌ట‌. బాహుబలి షూటింగ్ లో పాల్గొనే లోపు కూడా.. ఆ మూవీ చైనీస్ వెర్షన్ ప్రచారం చేస్తున్నాడు. అంటే బాహుబ‌లి2 షూటింగ్ అయిపోయే వ‌ర‌కు రానా జ‌క్కన్న‌కే అంకింతం అయిపోతాడ‌న్న మాట‌. దీని ప్ర‌కారం చూస్తే తేజ‌తో సినిమా షూటింగ్ స్టార్ట్ అవాలంటే రానా టోట‌ల్ గా ఫ్రీ అవాల‌నే విష‌యమైతే అర్థ‌మ‌వుతుంది.
ఇదిలా ఉండ‌గా తేజ తెర‌కెక్కిస్తున్న సినిమా ఒక్క‌టే ప్ర‌స్తుతానికి కాజ‌ల్ చేతిలో ఉంది. స‌ర్దార్ గబ్బ‌ర్ సింగ్, బ్ర‌హ్మోత్స‌వం సినిమాలు ఫెయిల్ అవడంతో తీవ్రంగా నిరాశ ప‌డిన కాజ‌ల్ క‌నీసం తేజ డైర‌క్ష‌న్ లో అయినా త‌న‌ను మ‌ళ్లీ స్టార్ హీరోయిన్ గా నిల‌బెడుతుందేమోన‌ని ఆశ‌లు పెట్టుకుంటే ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా తెలియ‌ని ప‌రిస్థితి తో అయోమ‌యంలో పడింది ఈ చంద‌మామ‌.