Latest News

Veeranjaneya Productions Movie Production No.1 Started Inmc 2017 Attracts The Highest Number Of Participants Ever `కృష్ణారావ్ సూప‌ర్ మార్కెట్‌` షూటింగ్ ప్రారంభం! "సోగ్గాడే చిన్ని నాయన" కంటే "రాజుగారి గది 2" పెద్ద హిట్ !! -అక్కినేని నాగార్జున అక్టోబ‌ర్ 23న హైదరాబాద్ లో గోపీచంద్ `ఆక్సిజ‌న్‌` ఆడియో రిలీజ్ చిన్న‌ సినిమాల‌కోసం ఐదో షో ప్రకటనకు తెలంగాణ‌ రాష్ట్ర‌ ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు - తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఇడియ‌ట్‌, విక్ర‌మార్కుడు సినిమాలు త‌ర్వాత ర‌వితేజ కెరీర్‌లో `రాజా ది గ్రేట్` బెస్ట్ ఫిలిం అవుతుంది - దిల్‌రాజు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, బివిఎస్ రవి, కృష్ణ "జవాన్" మూవీ ఫస్ట్ సాంగ్ కి అద్భుతమైన స్పందన అక్టోబ‌ర్ 27న `కాళ‌రాత్రి` షూటింగ్ ప్రారంభం "సువర్ణ సుందరి" గా మారిన జయప్రద

Ram, Santhosh srinivas Movie go to Sets From 3rd June


జూన్‌ 3 నుంచి రామ్‌, సంతోష్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ రెగ్యులర్‌ షూటింగ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'కందిరీగ' ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో.. 'నమో వెంకటేశ', 'దూకుడు', '1 నేనొక్కడినే', 'లెజెండ్‌', 'పవర్‌'(కన్నడం), 'ఆగడు', 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' వంటి సక్సెస్‌ ఫుల్‌ చిత్రాలను నిర్మించిన 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై ప్రొడక్షన్‌ నెం.8గా రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర ఓ భారీ చిత్రాన్ని ఉగాది ప‌ర్వ‌దినాన‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పుట్టినరోజు మే 15. ఈ సందర్భంగా రామ్‌కు నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చిత్ర విశేషాలను తెలిపారు. నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర మాట్లాడుతూ - ''జూన్‌ 3 నుంచి ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ను స్టార్ట్‌ చేస్తున్నాం. నాన్‌ స్టాప్‌గా షూటింగ్‌ చేసి దసరా కానుకగా సెప్టెంబర్‌ 30న గానీ, అక్టోబర్‌ 7న గానీ వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం. కందిరీగ తర్వాత రామ్‌, సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో ఇది మరో బిగ్గెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందబోతోంది. అలాగే మా బేనర్‌లో మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుంది'' అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్‌, ఆర్ట్‌: అవినాష్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా, సమర్పణ: వెంకట్‌ బోయనపల్లి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్‌ శ్రీనివాస్.