న్యూ లుక్ తో పిచ్చెక్కిస్తున్న రామ్


ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో కొత్త సినిమాను రూపొందించనున్నారు. గ‌తేడాది వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘నేను శైల‌జ’ ఎంత‌టి సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ హిట్ కాంబినేష‌న్ రిపీట్ అవుతుంది. ఈ చిత్రానికి స్ర‌వంతి ర‌వికిషోర్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. నేను శైల‌జ చిత్రంలో హీరో రామ్‌ను స‌రికొత్త‌గా ప్రెజంట్ చేసిన ద‌ర్శ‌కుడు ఈ చిత్రంలో స‌రికొత్త లుక్‌, బాడీలాంగ్వేజ్‌తో చూపించ‌బోతున్నారు. ఈ సినిమాలో రామ్ స‌ర‌స‌న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, మేఘా ఆకాష్ హీరోయిన్స్‌గా న‌టించనున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ సినిమాకు సంగీత సార‌థ్యం వ‌హిస్తుండ‌గా  సిరి వెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని, స‌మీర్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ, ఎడిటింగ్ శ్రీక‌ర్ ప్ర‌సాద్‌, ఆర్ట్ ఎ.ఎస్‌.ప్ర‌కాష్ అందిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 25 నుండి ప్రారంభం కానుంది.

అయితే షూటింగ్ కి ముందే సినిమాలో తన లుక్ ఎలా ఉండబోతుందో రామ్ చెప్పకనే చెప్పేసాడు. తన ట్విట్టర్ ఖాతాలో లేటెస్ట్ ఫోటో పెట్టి ఫాన్స్ కి పండగ వాతావరణం తీసుకొచ్చాడు. రామ్ పోస్ట్ చేసిన ఫొటో తన అభిమానులకి పిచ్చేక్కిన్చే రేంజ్ లో ఉంది.