ఇంత క‌ష్టం ఎవ‌రి కోసమ‌య్యా..?


యంగ్ హీరో రామ్ నేను శైలజతో హిట్ అందుకుని..ట్రాక్ లోకి వ‌చ్చినట్లే వ‌చ్చి, హైప‌ర్ మూవీతో ఫీవ‌ర్ వ‌చ్చి, దాని ఫ్లాప్ తో సైలెంట్ అయిపోయాడు. .. హైపర్ మూవీ ఫ్లాప్ తర్వాత బాగా సైలెంట్ అయిపోయాడు. కేవ‌లం ఒక్క సినిమా ఫ్లాప్ తో ఎన‌ర్జిటిక్ స్టార్ బ‌య‌ట‌కు రానంత‌టి మ‌నిషేమీ కాదండోయ్. మ‌నోడు కొత్త గెటప్ కోసం తెగ ట్రై చేస్తున్నాడు. ట్రై చేయ‌డం ఏంటి, ఏకంగా కొత్త గెట‌ప్ తో న్యూ ఇయ‌ర్ కు ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చేశాడు. అప్పుడప్పుడు నో షేవ్ న‌వంబ‌ర్ అంటూ, బాగా పెరిగిన గ‌డ్డంతో క‌నిపించినా, త‌న కంప్లీట్ లుక్ మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు బ‌య‌ట‌కు రానీయ‌లేదు. ఇప్పుడు ఏకంగా ఒక పెద్ద అద్దం ముందు సెల్ఫీ తీసి, త‌న మేకోవ‌ర్ ని ప్రెజెంట్ చేశాడు ఎనర్జిటిక్ హీరో. ఇంత‌కు ముందెప్పుడూ ట్రై చేయ‌ని లుక్ లో, రామ్ సూప‌ర్బ్ ట్రెండీ గా రెడీ అయిపోయాడు. దీనికితోడు సిక్స్ ప్యాక్ కూడా ట్రై చేయ‌డంతో బాడీ రూపం కూడా మారిపోయి డిఫరెంట్ లుక్ లోకి వచ్చేశాడు రామ్. ఇదంతా బాగానే ఉంది కానీ, దాదాపు 2 నెల‌లు దాటినా, త‌న కొత్త సినిమా గురించి ఇప్ప‌టి వ‌ర‌కు ఒక అనౌన్స్‌మెంట్ కూడా చేయ‌క‌పోవ‌డం ఏంటి అనేది మాత్రం ప్ర‌శ్న‌గానే మిగిలిపోయింది. కానీ గ‌త ఏడాది త‌నకు నేను శైల‌జ తో హిట్ ఇచ్చిన కిషోర్ తిరుమ‌ల‌తో ఆల్రెడీ ఓ మూవీకి సైన్ చేశాడ‌నే న్యూస్ అయితే రీసెంట్ గా బ‌య‌ట‌కు వ‌చ్చేసింద‌నుకోండి.