ఎన‌ర్జిటిక్ హీరో మ‌ళ్లీ అత‌నితోనే..


గ‌తేడాది నేను శైల‌జ తో మంచి ఫామ్ లోకి వ‌చ్చాడు అనుకున్న రామ్ హైప‌ర్ ప‌రాజ‌యంతో మ‌ళ్లీ కాస్త ఢీలా ప‌డ్డాడు. అప్ప‌టివ‌ర‌కు త‌న త‌రువాతి సినిమా అనిల్ రావిపూడితో చేద్దాం అనుకున్న రామ్, హైప‌ర్ రిజ‌ల్ట్ త‌ర్వాత ఈ ప్రాజెక్టును వ‌దులుకున్నాడు. హైప‌ర్ రిలీజ్ త‌ర్వాత కాస్త లాంగ్ గ్యాపే తీసుకున్నాడు రామ్. త‌న త‌ర్వాత ప్రాజెక్టు ఎవ‌రితో ఉండ‌బోతుందా అన్న అభిమానుల ఎదురుచూపుల‌కు త్వ‌ర‌లోనే చెక్ పెట్టేయ‌నున్నాడు రామ్. త‌న‌కు స‌రైన స‌మ‌యంలో మంచి విజ‌యాన్ని అందించిన కిషోర్ తిరుమ‌ల తోనే రామ్ మ‌ళ్లీ జ‌త‌క‌ట్ట‌నున్నాడ‌ని స‌మాచారం. రామ్ కోసం మ‌రోసారి కిషోర్ మెగాఫోన్ ప‌ట్ట‌నున్నాడు. నేను శైల‌జ త‌ర్వాత వెంక‌టేష్ తో కిషోర్ తిరుమ‌ల సినిమా చేయాల్సి ఉండ‌గా, ఆ సినిమాకు కొంచెం స‌మ‌యం ఉండ‌టంతో, రామ్ తోనే మ‌ళ్లీ ప్రాజెక్ట్ ను ప‌ట్టాలెక్కించ‌నున్నాడీ డైర‌క్ట‌ర్. ఈ సినిమాను శ్రీ స్ర‌వంతి మూవీస్ బ్యాన‌ర్ పై రామ్ పెద‌నాన్న స్ర‌వంతి ర‌వికిషోర్ నిర్మించ‌నున్నాడు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వ‌చ్చే నెలాఖ‌రులోగా రామ్ త‌న నెక్ట్స్ సినిమాను మొద‌లుపెట్టాల‌ని చూస్తున్న‌ట్లు స‌మాచారం.