చిరూ నుంచి బ‌న్నీ నేర్చుకున్నంత కూడా చెర్రీ నేర్చుకోలేక పోయాడు


టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టి నుంచి,త‌న కెరీర్ ను ఎంతో చ‌క్క‌గా ప్లాన్ చేసుకుంటూ వ‌స్తున్నాడు అల్లు అర్జున్. ఇటు సినీ ప‌రిశ్రమ‌లో ప్ర‌తి ఒక్క‌రితో మంచి రిలేష‌న్స్ మెయింటైన్ చేస్తూనే, అటు ఫ్యాన్స్ తోనూ ఎప్ప‌టిక‌ప్పుడు ట‌చ్ లో ఉంటూనే ఉంటాడు. ప్ర‌తీ మూడ్నెల్లకోసారి కొంత‌మంది సెలెక్టివ్ ఫ్యాన్స్ ను ఎంపిక చేసి మ‌రీ వాళ్ల‌తో ముచ్చ‌టిస్తాడు బ‌న్నీ. ఒక్క‌సారి బ‌న్నీని క‌లిసిన అభిమానెవ్వ‌రూ, మ‌రే హీరో పేరే ఎత్త‌డు. అంత‌లా బ‌న్నీ వారిని ఆక‌ట్టుకుంటాడు.

 అంతే కాదు త‌న పుట్టిన‌రోజును కూడా ఫ్యాన్స్ తో క‌లిసే సెల‌బ్రేట్ చేసుకుంటాడు బ‌న్నీ. త‌న బ‌ర్త్‌డే కోసం ఫ్యాన్స్ ఎంత బాగా సెల‌బ్రేట్ చేసుకుంటారో, ఎన్ని ఆశ‌లు పెట్టుకుంటారో అన్న విష‌యం తెలుసుకున్న బ‌న్నీ, ప్ర‌తీ బర్త్‌డే కి ఫ్యాన్స్ ను క‌లుస్తూ, ఆ రోజు ఏ షూటింగ్స్ పెట్టుకోకుండా ఉంటాడు. ఇదంతా చిరంజీవి స్టార్ హీరోగా ఎదిగే టైమ్ లో పాటించిన ప‌ద్ద‌తి. సేమ్ అదే ఇప్పుడు బ‌న్నీ కూడా ఫాలో అయిపోతున్నాడు. 

మామ‌య్య నుంచి అల్లుడైన బ‌న్నీ ఇదంతా నేర్చుకున్నాడు కానీ, చిరంజీవి త‌న‌యుడు మాత్రం ఈ ఫ్యాన్స్ ను మెయింటైన్ చేసే విష‌యంలో చాలా వెనుకబ‌డే ఉన్నాడ‌ని చెప్పాలి. అంతేకాదు, రామ్ చ‌ర‌ణ్ మీడియా ముందుకు రావాలంటేనే ఆలోచిస్తాడ‌నే టాక్ కూడా మూట గ‌ట్టుకున్నాడు. కెరీర్ విజ‌యంలో దూసుకెళ్తున్న టైమ్ లో ఇలాంటివ‌న్నీ చేస్తేనే స్టార్ హీరోగా ఎదిగే అవ‌కాశ‌ముంటుంది కాబ‌ట్టి, మెగా పవ‌ర్ స్టార్ ఇక‌నైనా ఇలాంటి విష‌యాల‌పై దృష్టి సారించాల‌ని ఫ్యాన్స్ అంటున్నారు.