రామ్ చ‌ర‌ణ్ షూటింగ్ లో జాయిన్ అయేది అప్పుడే..


'ధృవ‌'తో మాంచి హిట్ కొట్టిన రామ్ చ‌ర‌ణ్, త‌న తదుప‌రి సినిమా సుకుమార్ లో చేయ‌నున్నాడ‌నన్న విష‌యం తెలిసిందే. ఈసినిమా మార్చి 20వ తేదీనే మొద‌లు పెట్టాల్సి ఉండ‌గా, ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా షూటింగ్ మొద‌ల‌వ్వ‌లేదు. త‌న పుట్టిన‌రోజు కోసం విదేశాల్లో వెకేష‌న్ కు వెళ్లిన చెర్రీ ఇప్పుడు త‌న త‌దుప‌రి సినిమాకు ముహుర్తాన్ని నిర్ణ‌యించాడు. ఏప్రిల్ 1న సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాల‌ని రామ్ చ‌ర‌ణ్ ఫిక్స్ అయిన‌ట్లు తెలుస్తోంది. గ్రామీణ వాతావ‌ర‌ణంలో సాగే క‌థ అయినా కూడా, కొన్ని రోజులు హైద‌రాబాద్ లోని ఒక స్టూడియోలోనే షూటింగ్ జ‌ర‌గ‌నున్న‌ట్లు స‌మాచారం. 

'నాన్న‌కు ప్రేమ‌తో..' త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకుని సుకుమార్ తీస్తున్న చిత్ర‌మిది. ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న స‌మంత న‌టించ‌నుంది. మైత్రీ మూవీస్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్ర‌సాద్ స్వరాలు స‌మకూర్చ‌నున్నాడు.