Ram Charan Joins In Dhruva Shooting


We all know that Surender Reddy is directing a new movie with Ram charan named Dhruva. Present key scenes of this shooting is going on in brisk pace at Gachibowli IT complex. From yesterday Ram charan also joined in shooting. Charan is going to see as IPS in this film in which Rakul is taken as heroine.
This is a remake of Tamil super hit film 'Thanai Oruvan' in which same Aravind swami is acting as villain. Charan is going to see in a new look in this Film. Charan believed in the story and kept all hopes on this film. Let's wait and see if he gets hit with is or not.
ధృవ షూటింగ్ లో జాయిన్ అయిన చ‌ర‌ణ్
సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో, రామ్ చ‌ర‌ణ్ హీరోగా ధృవ సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ గ‌చ్చిబౌలిలోని ఐటీ కాంప్లెక్స్ లో కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా నిన్న‌టి నుంచి ఈ సినిమా షూటింగ్ లో చ‌ర‌ణ్ పాల్గొంటున్నాడు. చెర్రీ ట్రైనీ ఐపీఎస్ గా న‌టిస్తున్న ఈ సినిమాలో ర‌కుల్ హీరోయిన్ గా న‌టించ‌నుంది. త‌మిళ్ లో సూప‌ర్ హిట్ సినిమా 'త‌ని ఒరువ‌న్' రీమేక్ గా రూపొందుతున్నఈ సినిమాలో విల‌న్ గా మ‌ళ్లీ అర‌వింద్ స్వామినే న‌టిస్తున్నాడు. సినిమాలో కొత్త లుక్ లో క‌నిపించ‌డం కోసం చ‌ర‌ణ్ ఎంతో క‌స‌ర‌త్తు చేశాడు. క‌థా బ‌ల‌మున్న ఈ సినిమాపై చెర్రీ పెట్టుకున్న ఆశ‌ల‌ను ఈ సినిమా తీరుస్తుందో లేదో చూడాలి.