ఇంత‌కీ రేస్ లో నెగ్గేదెవ‌రు..?


టాలీవుడ్‌లో 2017 సంక్రాంతి చాలా స్పెష‌ల్ కానుంది. చాలా కాలం త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి – యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ త‌మ సినిమాల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద రంగానికి సిద్ధ‌మ‌వుతున్నారు. చిరు 150వ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150, బాల‌య్య 100వ సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి ఈ సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాయి. అయితే ఇది కేవ‌లం చిరు, బాలకృష్ణల మ‌ధ్య పోటీగానే కాకుండా వారి వార‌సులు రామ్ చ‌ర‌ణ్, మోక్ష‌జ్క్ష‌ల మ‌ధ్య పోటీగా కూడా చూస్తున్నారు కొంద‌రు. త‌మ తండ్రుల ప్ర‌తిష్టాత్మ‌క సినిమాల్లో వారసులు గెస్ట్ రోల్స్ చేస్తున్న విష‌యం విదిత‌మే. ఖైదీ నెం.150లో చెర్రీ ఓ సాంగ్ లో స్టెప్పులేయ‌నుండగా, గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణిలో శాత‌క‌ర్ణి కొడుకు పులోమావిగా క‌నిపించ‌నున్నాడు. మ‌రి ఈ రెండు గెస్ట్ రోల్స్‌లో ఎవ‌రి గెస్ట్ రోల్‌కు సూప‌ర్ నేమ్ వ‌స్తుందో …ఫైన‌ల్‌గా శాత‌క‌ర్ణి వ‌ర్సెస్ ఖైదీలో ఎవ‌రు విన్ అవుతారో తెలియాలంటే సంక్రాంతి వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.