వేరే దిక్కు లేక రాశీ ని తీసుకున్నార‌ట‌..


రామ్, రాశీఖ‌న్నా జంట‌గా న‌టించిన హైప‌ర్ రేపు థియేట‌ర్ల‌లోకి రానుంది. సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని 14రీల్స్ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించింది. అయితే ఈ సినిమా కోసం మొద‌ట చాలా మంది క‌థానాయిక‌ల‌నే అనుకున్నారు. త‌మ‌న్నా, ర‌కుల్ ఇలా ఇద్ద‌రి, ముగ్గురి పేర్లు వినిపించినా, అంద‌రూ రెమ్యున‌రేష‌న్ ఎక్కువ డిమాండ్ చేయ‌డం, రాశీ త‌క్కువ రెమ్యున‌రేష‌న్ కే ఒప్పుకోవ‌డంతో రాశీనే ఫైన‌ల్ చేశారు నిర్మాత‌లు. ఇదీ ఇప్ప‌టి వ‌ర‌కు అంద‌ర‌కూ తెలిసిన నిజం. కానీ ఆ టైమ్ లో రాశీ త‌ప్ప ఎవ‌రూ అందుబాటులో లేకపోవ‌డంతో త‌ప్ప‌క రాశీని తీసుకున్నామ‌ని రామ్ నోరు జారాడు. హైప‌ర్ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా మీడియా తో ముచ్చ‌టించిన రామ్ రాశీని హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకోవ‌డానికి ప్ర‌త్యేక కార‌ణం ఏమైనా ఉందా అని అడిగిన ప్ర‌శ్న‌కు రామ్ ఈ స‌మాధానం ఇచ్చి, వెంట‌నే త‌న మాట‌ను స‌రిచేసుకుంటూ, రాశీ త‌ప్ప ఈ పాత్ర వేరే ఎవ‌రికీ న‌ప్ప‌ద‌నే కార‌ణంతోనే త‌న‌ను ఫైన‌ల్ చేశారు అని చెప్పాడు ఎన‌ర్జిటిక్ స్టార్.