పవన్ కళ్యాణ్ కి హ్యాండ్ ఇచ్చిన రకుల్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ మాత్రం ఆ అవకాశాన్ని వదులుకుంటుంది చెప్పండి ? ప్రతి హీరోయిన్ కూడా తమ కెరీర్ లో ఎప్పుడో ఒకప్పుడు పవన్ సరసన నటించాలని ఆశపడిన వారే . కానీ ప్రస్తుతం వరసగా సినిమాలు చేసుకుంటూ పోతున్న ఒక హీరోయిన్ మాత్రం పవన్ ఇచ్చిన ఆఫర్ కి నో చెప్పేసిందట! ఆ సూపర్‌స్టార్ హీరోయిన్ ఎవరో కాదు.. రకుల్ ప్రీత్ సింగ్ . అయితే రకుల్ ఏ నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణం ఉంది అని చెప్పకోవచ్చు . తీ టౌన్ లో ఇప్పటికే అందరూ టాప్ హీరోల సరసన నటించిన రకుల్.. డేట్లు అడ్జెస్ట్ కాకపోవడం వల్లే పవన్ ఆఫర్ కి నో చెప్పినట్టు సమాచారం .

ప్రస్తుతం కాటమరాయుడు సినిమాతో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్.. ఆ తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్‌లో, దాని తర్వాత ఏఎం రత్నంతో ఆర్టీ నీసన్ దర్శకత్వంలో నటించబోతుండడం తెలిసిందే. అయతే.. ఆర్టీ నీసన్‌తో చేసే సినిమాలో పవన్‌కు జోడీగా రకుల్‌ను సంప్రదించారు అట చిత్ర యూనిట్ . అయితే.. ప్రస్తుతం మహేశ్‌బాబు-మురుగదాస్ డైరెక్షన్‌లో చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత నాగచైతన్య, సాయిధరమ్‌తేజ్, బెల్లంకొండ శ్రీనివాస్‌ల చిత్రాలతో బిజీగా ఉంటుందట. దీంతో ఆయా చిత్రాల డేట్ల వల్ల.. పవన్ సినిమాకు డేట్లను అడ్జెస్ట్ చేయలేనని ఆ చిత్ర నిర్మాతలకు తేల్చి చెప్పిందట. దీనితో చేసేది లేక చిత్ర యూనిట్ పవన్ కోసం మరో హీరోయిన్ ని వెతికే పనిలో పడిందట . ఏదేమైనా పవర్ స్టార్ సరసన నటించే ఛాన్స్ కూడా వదులుకుంది అంటే, రకుల్ ఎంత బిజీగా ఉందొ అని మిగతా స్టార్ హీరోయిన్స్ అంతా కుళ్ళుకుంటున్నారట !