ర‌కుల్ ఆశ‌ల‌న్నీ దానిపైనే


 కెరీర్ ప్రారంభం నుంచే డిఫరెంట్ రోల్స్ ను ఎంచుకుంటూ, తెర‌పై ఎప్పుడూ చ‌లాకీగా క‌నిపించే వారిలో ర‌కుల్ పేరు ముందుంటుంది. త‌న అందంతో, న‌ట‌న‌తో యూత్ హృద‌యాల‌ను కొల్లగొట్టే ర‌కుల్, మొద‌టి నుంచి కూడా అలాంటి పాత్ర‌లే చేస్తూ, ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ వ‌చ్చింది. ప్ర‌స్తుతం వ‌రుస హిట్స్ తో టాప్ లో ఉన్న ర‌కుల్, ఇప్పుడు త‌న త‌ర్వాతి సినిమాల్లోని పాత్ర‌ల ఎంపిక‌లో మ‌రింత కేర్ తీసుకుంటుంది. 

ఈ త‌రుణంలోనే క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌కత్వంలో నాగ‌చైత‌న్య కు జోడీ గా త‌ను న‌టించ‌బోయే సినిమాలో త‌న పాత్ర గురించి చెప్పుకొచ్చింది ర‌కుల్. ఈ సినిమాలో ఓ అంద‌మైన ప‌ల్లెటూరి అమ్మాయిగా ర‌కుల్ అల‌రించ‌నుంద‌ట. ఇప్ప‌టివ‌ర‌కు త‌ను చేసిన పాత్ర‌ల‌కు ఈ క్యారెక్ట‌ర్ పూర్తి భిన్నంగా ఉండ‌నుంద‌ని ర‌కుల్ చెప్తుంది. అంతే కాదు ఈ పాత్ర అమ్మ‌డుకు బాగా న‌చ్చేసింద‌ట కూడా. ఈ క్యారెక్ట‌ర్ ద్వారా త‌న‌కు ఇంకా మంచి గుర్తింపు ల‌భిస్తుంద‌ని ర‌కుల్ చెప్తుంది. చూద్దాం ఈసారి ర‌కుల్ ఎలా ఆక‌ట్టుకుంటుందో. ర‌కుల్ ప్ర‌స్తుతం మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ స‌ర‌స‌న న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.