నాగ‌చైతన్య, నేను ఇద్ద‌రం స‌మాన‌మే-ర‌కుల్


ర‌కుల్ ప్రీత్ సింగ్. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. ప్ర‌స్తుతం మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేష‌న్ లో రానున్న సినిమా స‌క్సెస్ అయితే మాత్రం ర‌కుల్ స్టేట‌స్ పూర్తిగా మారిపోతుంది. హీరోయిన్ నుంచి స్టార్ హీరోయిన్ కు ప్ర‌మోష‌న్ ఇచ్చేస్తుంది టాలీవుడ్. ఈ నేప‌థ్యంలో ర‌కుల్ , నాగ‌చైత‌న్య తో క‌లిసి చేస్తున్న సినిమా రారండోయ్ వేడుక చూద్దాం సినిమా గురించి ఆస‌క్తిక‌ర విష‌యం చెప్పింది.

ర‌కుల్ ఇండ‌స్ట్రీలో కెరీర్ స్టార్ట్ చేసి, ఆరేళ్లు అవుతున్నా, ఇప్ప‌టివ‌ర‌కు సాధించ‌ని ఓ ఫీట్ చైతూ సినిమాతో సాధించానంటోంది. ఇప్ప‌టివ‌ర‌కు తాను చేసిన పాత్ర‌ల‌న్నీ, సాదా సీదా పాత్ర‌లు మ‌రియు ఉప‌క‌థ‌లో వ‌చ్చే క్యారెక్ట‌ర్సే కానీ, మెయిన్ స్టోరీలో భాగంగా ఏ క్యారెక్ట‌ర్ లేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో మాత్రం నాగ‌చైత‌న్య పాత్ర‌కు ఎంత‌టి ప్రాధాన్య‌త ఉంటుందో, ర‌కుల్ పాత్ర‌కు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంద‌ని చెప్పుకొస్తుంది ర‌కుల్.