ఆ సినిమా షూటింగ్ పూర్తి కావ‌ద్ద‌ని కోరుకుంటున్న ర‌కుల్


ర‌కుల్ ఇండ‌స్ట్రీలో కెరీర్ స్టార్ట్ చేసి, ఆరేళ్లు అవుతున్నా, ఇప్ప‌టివ‌ర‌కు సాధించ‌ని ఓ ఫీట్ చైతూ సినిమాతో సాధించానంటోంది. ఇప్ప‌టివ‌ర‌కు తాను చేసిన పాత్ర‌ల‌న్నీ, సాదా సీదా పాత్ర‌లు మ‌రియు ఉప‌క‌థ‌లో వ‌చ్చే క్యారెక్ట‌ర్సే కానీ, మెయిన్ స్టోరీలో భాగంగా ఏ క్యారెక్ట‌ర్ లేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో మాత్రం నాగ‌చైత‌న్య పాత్ర‌కు ఎంత‌టి ప్రాధాన్య‌త ఉంటుందో, ర‌కుల్ పాత్ర‌కు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంద‌ని చెప్పుకొస్తుంది ర‌కుల్. 

ఒక ప‌ల్లెటూరి అమ్మాయిగా ర‌కుల్ ఈ సినిమాలో క‌నిపించ‌నుంది. త‌నంటే కుటుంబంలో అంద‌రికీ ఎంతో ఇష్ట‌మ‌ని, త‌న‌కు ఈ రోల్ ఎంతో బాగా న‌చ్చింద‌ని, ఎంత‌గా న‌చ్చిందంటే, ఈ సినిమా షూటింగ్ అసలు ఎప్ప‌టికీ పూర్తి కాకూడద‌ని కోరుకునేంత‌గా న‌చ్చింద‌ని చెప్తోంది ర‌కుల్. త‌న క్యారెక్ట‌ర్ ను ద‌ర్శ‌కుడు అంత బాగా తీర్చిదిద్దాడ‌ని అంటోంది ర‌కుల్ ప్రీత్ సింగ్. చూద్దాం మ‌రి అంత‌లా ర‌కుల్ ఈ సినిమాలో ఏం చేయ‌నుందో.