Latest News

'జై సింహా' మూవీ రివ్యూ 'అజ్ఞాత‌వాసి' మూవీ రివ్యూ జూన్‌ నుంచి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ కొత్త చిత్రం విష్ణు మంచు - జి నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ రేపు విడుదల ! న‌టన మీలో దాగున్న వ‌ర‌మా..? ఛాన్స్ మేమిస్తాం! గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' టీజర్‌ విడుదల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్ 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది - రాజ్ త‌రుణ్‌ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ , ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం

Rajamouli Won the ''Indian Of The Year 2015'' Award


Bahubali the movie which took the Telugu film industry to another level, Which selected for every nominatin and and got all awards. Central government also gave best film award for this film. Rajamouli got huge credit for taking TFI to world level. The movie got success where ever it released and smashed all records. Now recently CNNIBN conducted a award for entertainment zone named "Indian of the year" which got to Rajamouli who is flying telugu flag national wide.
Rajamouli shared his happiness for getting this prestigious award to him. He also said that this film is not only because of him, huge cast and crew worked hard for this output. When he say they would be more happy if this award came to his total team, total auditorium clapped for him. So many Bollywood stars are in race to get this award But finally Rajamouli won it.
This event took place at Delhi yesterday night in which known Politicians,movie stars, etc are graced. Rajamouli dedicated that award to his team.
ఇండియ‌న్ ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డుపై రాజ‌మౌళి అసంతృప్తి
బాహుబ‌లి.. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ను ప్ర‌పంచానికి చాటిచెప్పిన సినిమా. సెల‌క్ట్ కాని నామినేష‌న్ లేదు, రాని అవార్డు లేదు. ప‌ద్మ‌శ్రీ నుంచి, ఉత్త‌మ చిత్రంగా కేంద్ర ప్ర‌భుత్వ అవార్డు వ‌ర‌కు అన్నీ.. తెలుగు సినిమా వైభ‌వాన్ని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసిన ద‌ర్శ‌కుడిగా రాజ‌మౌళికి ఖ్యాతి ద‌క్కింది. రిలీజ్ అయిన ప్ర‌తిచోటా విజ‌య విహారం చేస్తూ, ఎన్నో రికార్డుల‌ను తిర‌గరాసింది. జాతీయ ఉత్త‌మ చిత్రంగా ఘ‌న‌త సాధించిన ఈ సినిమా, ఇప్పుడు తాజాగా సీఎన్ఎన్ ఐబీఎన్ ''ఇండియ‌న్ ఆఫ్ ది ఇయ‌ర్ 2015'' అవార్డుల్లో ఎంట‌ర్టైన్ మెంట్ విభాగంలో పుర‌స్కారాన్ని అందుకున్న రాజ‌మౌళి జాతీయ స్థాయిలో తెలుగు జెండాను రెప‌రెప‌లాడించేస్తున్నాడు.
అయితే ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే ఈ అవార్డు త‌న‌కు రావ‌డం ప‌ట్ల అసంతృప్తి వ్య‌క్తం చేశాడు రాజమౌళి. ''ఈ సినిమా కేవ‌లం త‌న క‌ష్టంతో మాత్ర‌మే సాధ్య‌ప‌డ‌లేద‌ని, ఎంతో మంది టీమ్ వ‌ర్క్ వ‌ల్ల‌నే బాహుబ‌లికి మంచి అవుట్‌పుట్ వ‌చ్చిందని, ఈ అవార్డు త‌న‌కు కాకుండా, త‌న టీమ్ అంద‌రికీ ఇస్తే చాలా సంతోషించేవాడిన‌ని'' రాజ‌మౌళి అన‌గానే ఆడిటోరియం అంతా చ‌ప్ప‌ట్ల‌తో మార్మోగింది. ఎంతోమంది బాలీవుడ్ ప్ర‌ముఖులు జ‌క్కన్న‌తో పోటీ ప‌డిన‌ప్ప‌టికీ, చివ‌రికి త‌నే నెగ్గాడు.
ఢిల్లీలో అంగ‌రంగ వైభ‌వంగా నిన్న రాత్రి జ‌రిగిన ఈ వేడుక‌లో ప‌లువురు సినీ, రాజ‌కీయ‌, క్రీడా ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో రాజ‌మౌళి ఈ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును త‌న సినిమా టీమ్ కు అంకింతం చేస్తున్నాన‌ని రాజ‌మౌళి చెప్పారు.