అనుష్క పేరు వింటేనే మండిపడుతున్న రాజమౌళి


బాహుబలి తో తిరుగులేని స్టార్ గా మారిపోయిన స్వీటీ అనుష్క ఫిగర్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో చాలానే జోకులు పేలుతున్నాయి. నిన్న మొన్నటి వరకు తన అందాలతో కుర్ర కారుని ఆకట్టుకున్న అనుష్క.. సైజ్ జీరో చిత్రం పుణ్యమా అంటూ బాగా లావైపోయింది. ఇక అప్పటి నుండి లావు తగ్గడానికి అనుష్క చేయని ప్రయత్నాలు లేవనే చెప్పుకోవాలి . ఆ ప్రాసెస్ లో స్వీటీ చేసిన ప్రయత్నాలు పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో భారీ శరీరంతోనే సింగం సిరీస్ లో నటించింది అనుష్క . సింగం3 సినిమా ట్రైలర్స్ లో లావుగా కనిపిస్తున్న అనుష్క ని చూసి మరో నమిత అంటూ ఘాటు విమర్శలు చేసిన వాళ్ళు లేకపోలేదు .

అయితే రీసెంట్ గా బాహుబలి2 చిత్రానికి రిపబ్లిక్ డే రోజున ఇచ్చిన పోస్టర్ లో మాత్రం స్లిమ్ లుక్ తో సూపర్బ్ గా అలరించింది. అనుష్క ఇంత సన్నగా మారిపోయిందా అనే సందేహాలు వచ్చినా.. అదంతా విజువల్ ఎఫెక్ట్స్ మహిమ అనే విషయం అందరికీ అర్ధమైంది. దీంతో 'అతి తక్కువ సమయంలో స్లిమ్ గా మారాలంటే ఏం చేయాలో తెలుసా.. అనుష్క లా గ్రాఫిక్స్ ను ఆశ్రయిస్తే సరి' అంటూ జోకులు పేలుస్తున్నారు నెటిజన్లు . అయితే ఇటు జక్కన్న కానీ అటు అనుష్క కానీ.. ఇలాంటి కామెంట్స్ కు పెద్దగా రియాక్ట్ కావడం లేదు. అయితే ఏ కామెంట్స్ రాజమౌళి దగ్గరకి చేరడంతో ఆయన బాగా ఫిల్ అయ్యారని సమాచారం. తాను ఇంత కస్టపడి బాహుబలి తెరకెక్కిస్తే .. అనుష్క ఒక్క దెబ్బతో ఆ కష్టాన్ని అంతా వృధా చేసింది అంటూ జక్కన్న తన అసహనాన్ని వ్యక్తం చేశాడట. మరి ఇంత కోపంగా ఉన్న రాజమౌళి ని అనుష్క ఎలా కూల్ చేస్తుందో చూడాలి.