Latest News

'జై సింహా' మూవీ రివ్యూ 'అజ్ఞాత‌వాసి' మూవీ రివ్యూ జూన్‌ నుంచి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ కొత్త చిత్రం విష్ణు మంచు - జి నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ రేపు విడుదల ! న‌టన మీలో దాగున్న వ‌ర‌మా..? ఛాన్స్ మేమిస్తాం! గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' టీజర్‌ విడుదల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్ 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది - రాజ్ త‌రుణ్‌ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ , ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం

Raj tharun the lucky hero ...


ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మంచి జోరు మీద ఉన్న హీరో రాజ్ తరుణ్.ఇటీవ‌ల రాజ్ త‌రుణ్ నటించిన ఆడోరకం ఈడోరకం పాజిటివ్ టాక్ ఉండ‌టం, మంచు విష్ణు వంటి స్టార్ హీరోతో నటించటం రాజ్ తరుణ్ కి ప్లస్ గా మారింది. ఈ మూవీ బాక్సాపీస్ వద్ద సైతం మంచి కలెక్షన్స్ తో ఆడటంతో, దీనికి సీక్వెల్ ని ప్లాన్ చేయాలని చూస్తున్నారు. సీక్వెల్ అంటే ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల్లో హైప్ పెరిగిపోవటం, తరవాత అది బాక్సాపీస్ వద్ద డిజాస్టర్ కావటం జరుగుతుంది. దీంతో సీక్వెల్ కంటే మరో డిఫ్రెంట్ మూవీనే ప్లాన్ చేస్తే ఎలా ఉటుంది? అంటూ ఆలోచిస్తున్నారు. ఈ విధంగా చూస్తే మళ్ళీ ముంచు విష్ణు, రాజ్ తరుణ్ కాంబినేషన్ లో ఓ మూవీ రాబోతుందని అంటున్నారు. ప్రస్తుతం రాజ్ తరుణ్ సైతం కమర్షియల్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. తను చేసిన సోలో సినిమాల కంటే ఇప్పుడు చేస్తున్న స్టార్ హీరో కాంబినేషన్ సినిమాలు త‌న మార్కెట్ ను పెంచుతుండ‌టంతో  రాజ్ తరుణ్ కి లక్ తిరిగిందని అంటున్నారు సినీ విశ్లేష‌కులు. మరోవైపు నాని, రాజ్ తరుణ్ కాంబినేషన్ లోనూ డైరెక్టర్స్ కథలని రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం నాని ఫుల్ ఫాంలో ఉన్నాడు. రాజ్ తరుణ్ కి సైతం యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరూ కలిసి చేస్తే కచ్ఛితంగా మంచి కమర్షియల్ మూవీ అవుతుందని భావిస్తున్నారు. రాజ్ తరుణ్ కూడా స్టార్ హీరోల సరసన స్క్రీన్ స్పేస్ ని పంచుకునే అవకాశం వస్తే, నటించేందుకు రెడీ ఉన్నాడు. మొత్తంగా రాజ్ తరుణ్ కి ప్రస్తుతం అంతా మంచే  జరుగుతుందని ఇండస్ట్రీ అంటుంది.