Raj Tharun faced Problems Through His Remuneration


నిజంగానే రాజ్ త‌రుణ్ రెమ్యున‌రేష‌న్ పెంచాడా..?
మొద‌టి సినిమా నుంచి మంచి దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్న రాజ్ త‌రుణ్ వ‌రుస హిట్లు ప‌డ‌టంతో, యూత్ లోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. హ్యాట్రిక్ హిట్ కొట్టిన రాజ్ త‌రరుణ్ ఆ మ‌ధ్య రెమ్యున‌రేష‌న్ పెంచో ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా చెప్పాడు. ప్ర‌స్తుతం త‌న రెమ్యున‌రేష‌న్ పెంచాడ‌నే వార్త వినిపిస్తుంది. సినిమాకు అక్ష‌రాలా కోటి రూపాయ‌లు ఆఫ‌ర్ చేస్తున్నాడ‌ట ఈ హీరో.
ఈ త‌రుణంలోనే రాజ్ త‌రుణ్ చేతి వ‌ర‌కు వ‌చ్చిన సినిమాల‌న్నీ చేజారిపోతున్నాయట‌. అవి వేరే హీరోల‌తో సెట్స్ పైకి వెళ్ల‌డానికి కూడా రెడీ అవుతున్నాయి. అలా ఆ సినిమాలు రాజ్ త‌రుణ్ ని కాద‌ని వెళ్లిపోవ‌డానికి గల ముఖ్య‌కార‌ణం మాత్రం త‌న రెమ్యునరేష‌న్ అనే చెప్పుకుంటున్నారు.