ఎన్టీఆర్‌కు రాశీఖ‌న్నా ఖాయ‌మైన‌ట్టే..


తెలుగులో త‌ర్వాత తరానికి పాపుల‌ర్ అండ్ టాప్ హీరోయిన్ కావాల‌ని రాశీ ఖ‌న్నా చేస్తున్న ప్ర‌య‌త్నాలు అన్నీ ఇన్నీ కావు. ఎన్ని చేసినా ఏం లాభం, టైమ్ క‌లిసి రాక‌పోతే. మొద‌టి చిన్న హీరోల‌తో త‌న కెరీర్ ను స్టార్ట్ చేసిన రాశీ, మీడియం హీరోల‌తో ఛాన్స్ లు ప‌ట్టేసింది కానీ, స్టార్ హీరోల ప‌క్క‌న న‌టించే ఛాన్స్ మాత్రం కొట్ట‌లేక‌పోతుంది. ర‌వితేజ తో త‌ప్ప‌, ఏ స్టార్ హీరోతోనూ ఇప్ప‌టివ‌ర‌కు ప‌ని చేయ‌ని రాశీఖ‌న్నాకు ఎన్టీఆర్-బాబీ ద‌ర్శ‌క‌త్వంలో, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై క‌ళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఎన్టీఆర్ 27వ చిత్రంలో రాశీఖ‌న్నాను ఒక హీరోయ‌న్ గా ఫైన‌లైజ్ చేశార‌ని స‌మాచారం. ఈ సినిమా కోసం కాజ‌ల్, రాశీ, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, నివేదా థామ‌స్, అను ఇమ్మాన్యుయేల్ ల పేర్లు ప‌రిశీల‌న‌లో ఉండ‌గా, వీరిలో రాశీ ని ఇప్ప‌టికే ఖ‌రారు చేసేశార‌ని టాక్. ఈ మ‌థ్య మ‌రింత నాజూకుగా క‌నిపిస్తున్న రాశీఖ‌న్నా, ఆల్రెడీ ర‌వితేజ ట‌చ్ చేసి చూడు లో ఛాన్స్ కొట్టేసింది. ఇప్పుడు మ‌ళ్లీ వెంట‌నే ఎన్టీఆర్ తో న‌టించే ఛాన్స్ కొట్టేయ‌డంతో ఈ బొద్దుగుమ్మ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ఇక‌నైనా రాశీ ఖ‌న్నా కెరీర్ ఊపందుకోవాల‌ని ఆశిద్దాం. ఫిబ్ర‌వ‌రి 10 న ప్రారంభం కానున్న ఈ చిత్రానికి మిగతా ఇద్ద‌రు హీరోయిన్స్ ను కూడా త్వ‌ర‌లోనే ఫైన‌ల్ చేయ‌నున్నారు.