రాశీఖ‌న్నా వ‌ర్కవుట్స్ లో సైడ్ ఎఫెక్ట్స్


విపరీతంగా వర్కవుట్స్ చేస్తే ఏమొస్తుంది? అని అడిగే వారికి స‌మాధానంగా టాలీవుడ్ బ్యూటీ రాశీ ఓ స్టేట్ మెంట్ ఇచ్చింది. ఫుల్లుగా వర్కవుట్స్ చేసిన వెంటనే.. ఓ సెల్ఫీ తీసుకుని ఇన్ స్టాగ్రామ్ లో పెట్టేసింది రాశి ఖన్నా. పింక్ కలర్ టాప్ లో ఒంట్లోని ప్రతీ అంగుళం చెమటలు పట్టేసిన పరిస్థితిని చూపిస్తోందన్న మాట. మొహం.. భుజాలు.. మెడ ఇలా మొత్తం చెమటలతో తడిసిపోయాయన్న మాట. 'వర్కవుట్ చేస్తున్నా.. దీని సైడ్ ఎఫెక్ట్స్ లో చెమట.. ఆనందం.. ఓ అద్భుతమైన ఫీలింగ్ కూడా ఉంటాయ్' అంటోంది రాశి.
 
అమ్మడికి చెమటలు పట్టడం సంగతేమో కానీ.. ఇలాంటి ఒరిజినల్ లుక్ లు చూపిస్తే.. చూసినోళ్లకి చెమటలు పట్టేయడం ఖాయం. రాశి ఖన్నా చెప్పిన సైడ్ ఎఫెక్ట్స్ అప్పుడు వాళ్లకు కూడా పాకేస్తాయేమో కదా!