బాల‌య్య విష‌యంలోనూ పూరీ త‌గ్గ‌ట్లేదుగా..


పూరీ జ‌గ‌న్నాధ్. సినిమా ఎప్పుడు అనౌన్స్ చేస్తాడో, ఎప్పుడు మొద‌లు పెడ‌తాడో, ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలిసిందే. ప్ర‌స్తుతం బాల‌య్య 101 వ సినిమా షూటింగ్ ను మొద‌లుపెట్టిన పూరీ అప్పుడే మొద‌టి షెడ్యూల్ ను పూర్తి చేసేశాడ‌ట‌. హీరో ఎవ‌రైనా త‌న స్పీడ్ మాత్రం అంతే ఉంటుంద‌ని మ‌రోసారి పూరీ నిరూపించుకున్నాడు. అస‌లు ఈ సినిమా విష‌యంలో అన్నీ వెంట‌వెంట‌నే స‌డ‌న్ గా జ‌రిగిపోతున్నాయి. 

బాల‌య్య త‌దుప‌రి సినిమా ఏంటా అని అంద‌రూ అనుకుంటున్న టైమ్ లో ప్రాజెక్ట్ ను ప్ర‌క‌టించి షాక్ ఇచ్చాడు పూరీ. వెంట‌నే ముహుర్తం షాట్. ఆపై రెగ్యుల‌ర్ షూటింగ్ ఇలా అన్నీ త్వ‌ర‌త్వ‌ర‌గా జ‌రిగిపోయాయి. ఈనెల 16న రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుపెట్టిన ఈ సినిమా 22 వ తేదీకి మొద‌టి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది అంటే ఇక్క‌డే పూరీ స్పీడ్ అర్థ‌మ‌వుతోంది. 

Image result for puri jagannadh, balakrishna

సినిమా లాంఛ్ రోజు చెప్పిన‌ట్లే ఈ సినిమాలో మ‌రోసారి నంద‌మూరి అభిమానుల‌కు పండ‌గ‌లా ఈ సినిమా ఉండ‌బోతుంద‌ని బ‌ల్ల గుద్ది చెప్పాడు పూరీ. చూస్తుంటే పూరీ అనుకున్న టైమ్ సెప్టెంబ‌ర్ 29 కంటే ముందే సినిమాను పూర్తి చేసేలా ఉన్నాడు. భవ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై పూరీ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రానికి ట‌పోరి అనే టైటిల్  ను ఖ‌రారు చేసిన‌ట్లుగా వార్త‌లైతే వ‌స్తున్నాయి కానీ ఇంకా ఇప్ప‌టివ‌ర‌కు ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న  రాలేదు. ఇప్ప‌టివ‌ర‌కు హీరోయిన్స్ కూడా ఇంకా ఫైన‌ల్ కాలేదు కానీ సినిమా అప్పుడే ఫ‌స్ట్ షెడ్యూల్ ను పూర్తి చేయ‌డం అంటే మాట‌లు కాదు.