Puri Committed With All Star heroes


PURI'S PROJECTS..

PURI JAGANNADH ...Dare & dashing Director of South is busy with hand full of projects.. Puri has a talent to finish a film in 3 months showing his express speed,But Rogue is a project which he started few months back which is in pause mode. Though movie is still on sets ,publicity is in high swing about puri's upcoming movies. Puri waved green signal to Venkatesh 75th movie , Mahesh's janagana mana & presently puri is busy with the shooting of KalyanRam. Having these projects in hands Puri signed one more new project with Jr.NTR as well.                                                                        He set story for Jr.NTR called "NETAJI" Official news will be declared on Jr.NTR's Birth Day. If Puri follows these schedules in upcoming months ..He will be in no.1 directors position this year. Will PURI JAGANNADH will finish all his projects on time...??? This is the question fluttering all over TFI...   త‌ను త‌లుచుకుంటే మూడు నెలల్లో సినిమాను పూర్తి చేసి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాగ‌ల‌డు. సినిమా  మేకింగ్ లో  ఆయనది ఎక్స్ ప్రెస్ వేగం అని చెప్పొచ్చు. కానీ రోగ్ అంటూ ఓ సినిమాని మొదలుపెట్టి నెలలు గడుస్తున్నా చడీచప్పుడు లేదు. ఇంతకీ ఆ సినిమా షూటింగ్ జరుగుతుందో లేదో తెలియని పరిస్థితి.  ఇంత‌లో క‌ళ్యాణ్ రామ్ తో మ‌రో సినిమా మొద‌లు పెట్టాడు పూరీ జ‌గ‌న్నాధ్. ఇలా రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నా కూడా త‌న కొత్త సినిమాల ప్రకటనలు మాత్రం ఒక దాని వెంట ఒకటి వచ్చేస్తున్నాయి.  కానీ ఆయ‌న మాత్రం అన్ని సినిమాల‌పైనా పక్కా ప్రణాళికతోనే ఉన్నాడ‌ని తెలుస్తుంది. పూరి జ‌గ‌న్నాధ్. డేర్ అండ్ డాషింగ్ డైర‌క్ట‌ర్. ప్ర‌స్తుతం పూరి చేతిలో చాలా సినిమాలున్నాయి. మొదట మహేష్ తో జనగణ మన చిత్రాన్ని ప్రకటించాడు పూరి. ఆ తర్వాత వెంకటేష్ 75వ సినిమా అంటూ కొత్త కబురు బయటికొచ్చింది. నిజంగానే పూరి, వెంకీ కలిసి ఆ సినిమా గురించి చర్చలు కూడా జరిపారు. ఆ రెండు సినిమాల గురించి చర్చ జరుగుతుండగానే పూరి కాంపౌండ్ నుంచి మరో కబురు బయటికొచ్చింది. ఎన్టీఆర్ కథానాయకుడిగా పూరి ఓ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నాడన్నదే ఆ కబురు. మహేష్ ,వెంకీల సినిమాలకి సంబంధించే ఇంకా ఎలాంటి పురోగతి లేదు. అప్పుడే ఎన్టీఆర్ కోసం పూరి కథ సిద్ధం చేశాడా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు సినీ పరిశ్రమ జనాలు. కానీ పూరి జగన్నాథ్  `నేతాజీ` పేరుతో ఎన్టీఆర్ కోసం కూడా ఓ కథని సిద్ధం చేశాడని ఎన్టీఆర్ పుట్టినరోజున ఆ సినిమాని ప్రకటించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలన్నీ అనుకున్నట్టుగా జరిగితే పూరికి టాలీవుడ్ లో తిరుగే  ఉండ‌దు. మహేష్, వెంకటేష్, ఎన్టీఆర్ లాంటి అగ్ర కథానాయకులతో సినిమాలంటే ఆమాత్రం హ‌డావుడి ఉంటుంది మ‌రి.