సినిమాని ఆదరిస్తున్నందుకు కృతఙ్ఞతలు... కానీ హీరో సందీప్ కిషన్ నా విలన్


ఎస్‌బి‌కె ఫిలిమ్స్ కార్పొరేషన్ పతాకంపై ఎస్ కె అబ్దుల్లా సమర్పించిన చిత్రం ప్రాజెక్ట్ Z. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి స్పందనతో దూసుకెళుతోంది... ఈ సందర్భంగా సమర్పకుడు ఎస్ కె బషీద్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈనేపథ్యంలో ఆయన మాట్లాడుతూ... ‘‘ప్రాజెక్ట్ Z సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు... మంచి చిత్రం అని అభినందిస్తున్నారు.. అందుకు ఆడియన్స్ కు కృతఙ్ఞతలు తెలియచేస్తున్నా...  ప్రతి సినిమాలో ఒక విలన్ ఉంటాడు కానీ నాజీవితంలో హీరో సందీప్ కిషన్ విలన్ గా మారి సినిమాను చంపేస్తున్నాడు.. 2007 నుంచి నేను ఏ సినీ ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇన్ని సంవత్సరాలు నాకు నచ్చిన సినిమాలు   చేసుకుంటూ ఎవరి సహాయసహకారాలు లేకున్నా నా సొంత డబ్బు తో చేసుకుపోతున్నా.... అలాంటి నాకు హీరో సందీప్ కిషన్ విలనయ్యాడు.. ఈ సినిమా తలపెట్టినప్పటి నుంచి నాకు పలు రకాలుగా అడ్డుపడుతున్నాడు.. వరుసగా 19 సినిమాలు సందీప్ కిషన్ చేసిన సినిమాలు పరాజయాలయ్యాయి.. అందుచే నేను సెంటిమెంటల్ గా పోయి తన వాయిస్ ను కాదని డబ్బింగ్ వేరే వారి చేత చెప్పించాను... దాంతో సందీప్ కిషన్ ఈ సినిమా లో నా వాయిస్ కాదు, సినిమా ప్రమోషన్స్ లో నేను పాల్గొనని, సినిమా విడుదలను అడ్డుకుంటామని చాలా సార్లు  ప్రయతించాడు... అందుకు నేను లీగల్ గా ప్రొసీడ్ అయ్యి కష్టపడి సొంత డబ్బుతో విడుదల చేసుకున్నా.... కానీ సందీప్ కిషన్ నాపై పగ పట్టి నట్టుగా వ్యవగారిస్తున్నాడు... సినిమా బాగారాలేదు కనుక నేనే సినిమాను మళ్లీ రీషూట్ చేసి త్వరలో విడుదల చేస్తానంటూ ప్రచారం చేస్తున్నాడు... నన్ను బ్రదర్ ... బ్రదర్ అని పిలుస్తూనే నా కొంప  ముంచాడు... బయర్స్ ను బెదిరిస్తూ తానే ఫైనాన్స్ తీసుకొని కొంత మంది తో కలసి మరోసారి  విడుదల చేస్తా నంటూ నన్ను ఇబ్బంది పాలు చేస్తున్నాడు... అంతే కాదు తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరించడం లేదు కనుక తెలుగు ప్రెస్సుమీట్స్ కు రాను అంటూ చెబుతున్నాడు... సందీప్ కిషన్ లాంటి మోసగాడి చేతిలో ఇంకో నిర్మాతలు మోసపోకూడదనే ఈ సంధర్బంగా తెలియపరుస్తున్నా అన్నారు...