​'ఏజంట్‌ భైరవ' ఇంత పెద్ద సక్సెస్‌ చేసిన అందరికీ ధన్యవాదాలు: బెల్లం రామకృష్ణారెడ్డి


పుష్యమి ఫిల్మ్‌ మేకర్స్‌ పతాకంపై విజయ్‌, కీర్తి సురేష్‌, జగపతిబాబు ప్రధాన తారాగణంగా భరతన్‌ దర్శకత్వంలో నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మించిన చిత్రం 'ఏజంట్‌ భైరవ'. ఈ చిత్రం విడుదలైన అన్నీ ధియేటర్లలో హౌస్‌ఫుల్‌ కలెక్షన్లతో ప్రదర్శింపబడుతోంది.

ఈ సందర్భంగా చిత్ర విజయం గురించి నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..'తమిళ్‌స్టార్‌ హీరో, ఇళయదళపతి విజయ్‌ విజయ్‌ నటించిన 'ఏజంట్‌ భైరవ' సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. 228 ధియేటర్లలో రిలీజ్‌ చేస్తే..ఈ వారం మరో 15 ధియేటర్లు పెరిగాయి. విడుదలైన అన్ని చోట్ల ఈ చిత్రం మౌత్‌ టాక్‌తో, అద్భుతమైన కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో విజయ్‌, కీర్తిసురేష్‌, జగపతిబాబుల నటన ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. జగపతిబాబుగారి నటన ఈ సినిమాకే హైలైట్‌. ఇంత పెద్ద సక్సెస్‌ని ఇచ్చిన ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ విజయంతో మరిన్ని మంచి చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి శతవిధాలా ప్రయత్నిస్తాను...' అని అన్నారు.

విజయ్‌, కీర్తిసురేష్‌, జగపతిబాబు, సతీష్‌, వై.జి. మహేంద్ర, తంబిరామయ్య, డేనియల్‌ బాలాజీ, ఆపర్ణ వినోద్‌, పాప్రీ గోష్‌, హరిష్‌ ఉత్తమున్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సంతోష్‌ నారాయణ్‌, కెమెరా: ఎమ్‌. సుకుమార్‌, ఫైట్స్‌: అనల్‌ అరసు, ఆర్ట్‌: ఎమ్‌. ప్రభాకరన్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌. కె. ఎల్‌, నిర్మాత: బెల్లం రామకృష్ణారెడ్డి, కథ-దర్శకత్వం: భరతన్‌.