Latest News

ఆగష్టు 19 న మంచు మనోజ్ ' ఒక్కడు మిగిలాడు ' ట్రైలర్ విడుదల ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా వి.ఎస్‌.క్రియేటివ్‌ వర్క్స్ బేన‌ర్‌పై కొత్త చిత్రం ప్రారంభం నేడే పైసా వసూల్ ఆడియో విడుదల బిగ్ బాస్ షోలో సంద‌డి చేసిన తాప్సీ దసరా రేసులో శర్వానంద్ నాగచైతన్య ' యుద్ధం శరణం ' రిలీజ్ డేట్ ఫిక్స్ ఆగష్టు 24న‌ శ‌ర్వానంద్‌, యు.వి.క్రియేషన్స్, మారుతి "మ‌హ‌నుభావుడు" ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌ సెప్టెంబరు మొదటివారంలో మేడమీద అబ్బాయి నెపోలియన్‌' ట్రైలర్‌ విడుదల చేసిన హీరో సందీప్ కిష‌న్‌, నిర్మాత కె.ఎల్‌.దామోద‌ర్ ప్ర‌సాద్‌ `ద‌ళ‌ప‌తి`లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న శ్రేయా ఘోష‌ల్ సాంగ్

కోలార్ లో షూటింగ్ జరుపుకుంటున్న ప్రేమభిక్ష


శ్రీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో అనిల్‌, శృతిలయ హీరోహీరోయిన్‌లుగా, ఎం. ఎన్‌. బైరారెడ్డి, నాగరాజు నిర్మాతలుగా, ఆర్‌.కె. గాంధీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'ప్రేమభిక్ష'. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి న షూటింగ్ కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ లో శరవేగంగా జరుపుకుంటోంది . ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ..అనంతపురం జిల్లా భద్రపట్నం అనే గ్రామంలో జరిగిన యదార్ధ ఘటనను తీసుకుని దర్శకుడు గాంధీ ఓ మంచి కథను తయారు చేశాడు.సగానికి పైగా టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈచిత్రం యొక్క పూర్తి టాకీ ఈ నెల 25 వరకు కోలార్ లో జరుగుతున్న షెడ్యూల్ తో కంప్లీట్ అవుతుంది అని అన్నారు .దర్శకుడు ఆర్ కె గాంధీ మాట్లడుతూ ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా:దేవిశ్రీ గురూజీ నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అని అన్నారు . అలాగే ప్రముఖ సీనియర్ నటుడు సుమన్ మా చిత్రం లో నటించడం మాకు గర్వకారణం అని అన్నారు . నవంబర్ ప్రథమార్థంలో ఆడియో ఆవిష్కరణ జరపనున్నాం అని అన్నారు . అనిల్‌, శృతిలయ, సుమన్‌,కవిత ,డా :దేవిశ్రీ గురూజీ , షఫీ, రాజేంద్ర, కింగ్‌ మోహన్‌, కిల్లర్‌ వెంకటేష్‌, జ్యోతి మొదలగు వారు నటిస్తున్న ఈ చిత్రానికి స్టంట్స్‌: శంకర్‌, కొరియోగ్రఫీ: ఎస్‌.ఎస్‌.కె. సందీప్‌, పాటలు: ఘంటాడి కృష్ణ, రామ్‌ పైడిశెట్టి; సంగీతం: ఘంటాడి కృష్ణ, కెమెరా: ప్రమోద్‌. ఆర్‌; నిర్మాతలు: ఎం.ఎన్‌. బైరారెడ్డి, నాగరాజు; కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం :ఆర్‌.కె.గాంధీ.