ప్రేమభిక్ష షూటింగ్‌ పూర్తి...


ఓం శ్రీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై అనిల్‌కుమార్‌, శృతిలయ హీరో, హీరోయిన్లుగా పరిచయం అవుతూ..ఎం.ఎన్‌. బైరారెడ్డి మరియు నాగరాజు నిర్మాతలుగా ఆర్‌.కె.గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ప్రేమభిక్ష'. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని, షూటింగ్‌ అనంతర కార్యక్రమాలకు సిద్దమవుతోంది. షూటింగ్‌ పూర్తయిన విషయాన్ని తెలిపేందుకు చిత్ర యూనిట్‌ ప్రెస్‌మీట్‌ని నిర్వహించింది. హీరో అనిల్‌కుమార్‌తో పాటు నటులు సుమన్‌, జీవా, రాజేంద్ర, సంగీత దర్శకుడు ఘంటాడి క్రిష్ణ, నిర్మాతలు ఎం.ఎన్‌.బైరారెడ్డి, నాగరాజులు మరియు దర్శకుడు ఆర్‌.కె. గాంధీ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
prema bhikshaఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ..అనంతపురం జిల్లా భద్రపట్నం అనే గ్రామంలో 1970లో జరిగిన యధార్ధ ఘటనని ఆధారంగా చేసుకుని దర్శకుడు ఆర్‌.కె.గాంధీ ఈ చిత్రానికి చక్కని కథని రూపొందించారు. ఆసక్తికరంగా సాగే స్క్రీన్‌ప్లేతో పాటు మంచి సంభాషణలతో కూడా ఆర్‌.కె.గాంధీ మెప్పిస్తారు. ప్రస్తుతం షూటింగ్‌ మొత్తం పూర్తయింది. 70 శాతం షూటింగ్‌ అనంతపురం జిల్లా భద్రపట్నంలో చిత్రీకరించాము. మిగతా భాగం కర్నాటకలోని కొన్ని ప్రాంతాలలో చిత్రీకరించాము. కన్నడ సినీ ఇండస్ట్రీలోని కొంతమంది ప్రముఖ నటులు కూడా ఈ చిత్రంలో నటించారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అతి త్వరలో ఘంటాడి క్రిష్ణగారు స్వరపరిచిన ఆడియోని విడుదల చేస్తాము..అని అన్నారు. 
 
అనిల్‌కుమార్‌, శృతిలయ, సుమన్‌, షఫి, జీవా, కవిత, సుమన్‌శెట్టి, రాజేంద్ర, గోపీకర్‌ మొదలగువారు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఘంటాడి క్రిష్ణ, కెమెరా: ప్రమోద్‌. ఆర్‌, సాహిత్యం: రాం పైడిశెట్టి, ఘంటాడి క్రిష్ణ, ఆర్ట్‌: బాబు, స్టంట్స్‌: శంకర్‌, కొరియోగ్రఫీ: ఎస్‌.ఎస్‌.కె. సందీప్‌, పి.ఆర్‌.ఓ: వీరబాబు, మేనేజర్‌: వినయ్‌, నిర్మాతలు: ఎం.ఎన్‌.బైరారెడ్డి, నాగరాజు; కథ-చిత్రకథ-మాటలు-దర్శకత్వం: ఆర్‌.కె.గాంధీ.