గుంటూరు టూ అమెరికా వ‌యా న‌క్ష‌త్రం


ల‌క్కున్నోడు సినిమా త‌ర్వాత మంచు విష్ణు న‌టిస్తున్న చిత్రం ఆచారి అమెరికా యాత్ర‌. ఈ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ కూడా ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. సినిమాను ప్ర‌క‌టించిన రోజే వ‌చ్చిన ఈ ఫ‌స్ట్ లుక్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఫ‌స్ట్ నుంచే విష్ణు, బ్ర‌హ్మానందం ల కాంబినేష‌న్ లో సినిమా అంటే మంచి డిమాండే ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం మంచు విష్ణు స‌ర‌స‌న కంచె చిత్రంతో యూత్ మ‌న‌సుల‌ను దోచుకున్న ప్ర‌గ్యా జైస్వాల్ ను ఫైన‌ల్ చేశారు. రీసెంట్ గా త‌న త‌మ్ముడు మ‌నోజ్ తో క‌లిసి గుంటూరోడు చిత్రంలో న‌టించిన ప్ర‌గ్యా తో ఇప్పుడు విష్ణు రొమాన్స్ చేయ‌నున్నాడు. 
 
కంచె, ఓం న‌మో వేంక‌టేశాయ‌, గుంటూరోడు ఇలా సెలెక్టివ్ రోల్స్ ను ఎంచుకుంటూ వ‌స్తున్న ప్ర‌గ్యా, ఈ సినిమాలో సాంప్ర‌దాయబ‌ద్దంగా క‌నిపించాల్సిన పాత్ర కావ‌డం, పెర్ఫామెన్స్ కు కూడా బాగా స్కోప్ ఉన్న పాత్ర కావడంతోనే, ఈ సినిమా ఒప్పుకున్న‌ట్లు స‌మాచారం. మే నెల మొద‌టి వారం నుంచి ప్ర‌గ్యా షూటింగ్ లో పాల్గొననుంది. ప్ర‌స్తుతం ప్రగ్యా కృష్ణ‌వంశీ న‌క్ష‌త్రం సినిమాలోనూ, బోయ‌పాటి - బెల్లంకొండ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న సినిమాల్లో న‌టిస్తుంది.