ప్ర‌భాస్ ఒక రోజు ముందే వ‌స్తున్నాడు


దాదాపు నాలుగేళ్ల‌కు పైగా ఏ సినిమా లేకుండా కేవ‌లం బాహుబ‌లికే అంకిత‌మైన ప్ర‌భాస్ బాహుబ‌లి2 త‌ర్వాత సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా మొద‌లుపెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈసినిమా టీజ‌ర్ ను బాహుబ‌లి ది కంక్లూజ‌న్ సినిమాతో పాటూ ప్ర‌దర్శించాల‌ని సుజీత్ టీమ్ తెగ ట్రై చేస్తుంద‌ని ఆల్రెడీ వార్త‌లు వచ్చిన సంగ‌తి తెలిసిందే.అయితే ఫ‌స్ట్ ఈ వార్త వ‌చ్చిన‌ప్పుడు అంతా రూమ‌ర్ అనుకున్నారు కానీ ఆ వార్త నిజం కావ‌డానికి అవ‌కాశాలు లేక‌పోలేదు. ఆ దిశ‌గానే సినిమా యూనిట్ కూడా అడుగులు వేస్తుంది. ఇప్ప‌టికే ప్ర‌భాస్ మీద కొన్ని కీల‌క స‌న్నివేశాలు, యాక్ష‌న్ సీన్స్ ను కూడా తెర‌కెక్కించార‌ని స‌మాచారం. ఈ టీజ‌ర్ ను రిలీజ్ చేయ‌డం కోస‌మే యూవీ క్రియేష‌న్స్ తొంద‌ర తొంద‌రగా సాహో అనే టైటిల్ ను కూడా రిజిస్ట‌ర్ చేయించ‌ద‌ని టాక్. 

అయితే బాహుబ‌లి2 థియేట‌ర్ల‌లో ఈ సినిమా టీజ‌ర్ వేయ‌డం నిజ‌మే కానీ,టీజ‌ర్ మాత్రం ఆ రోజే విడుద‌ల చేయ‌డమ‌న్న‌ది మాత్రం నిజం కాదు. బాహుబ‌లి2 రిలీజ్ కు ఒక్క రోజు ముందు అంటే ఏప్రిల్ 27 సాయంత్ర‌మే ఈ సినిమా టీజ‌ర్ ను యూట్యూబ్ లో విడుద‌ల చేయ‌నున్నార‌ట‌. దేశ‌వ్యాప్తంగా దాదాపు 6500 థియేట‌ర్ల లో రిలీజవుతున్న బాహుబ‌లి2 సినిమా ఇంట‌ర్వెల్ లో ఈ టీజ‌ర్ ప్ర‌ద‌ర్శిత‌మ‌వ్వ‌డం అంటే  మామూలు విష‌యం కాదు. దీనికితోడు టీజ‌ర్ లో విష‌య‌ముంటే, ఇక ఆ సినిమాకు బ‌జ్ ఏ రేంజ్ లో క్రియేట్ అవుతుందో ఊహించ‌డం కూడా క‌ష్ట‌మే. ఏదేమైనా త‌న నెక్ట్స్ సినిమా టీజ‌ర్ ను బాహుబ‌లి2 థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శించాల‌న్న ప్ర‌భాస్ ప్లానింగ్ ను అభినందించాల్సిందే.